ఎలక్షన్స్ కి భయపడ్డ రజినీకాంత్

Update: 2016-02-13 10:02 GMT
తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నికలు అంటే ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఒకట్రెండు సార్లు అభిప్రాయాలు చెప్పినా.. మెజారిటీ సార్లు యాక్టివ్ పాలిటిక్స్ దూరంగానే ఉన్నారు. ఇప్పుడు సడెన్ గా ఆయనకు సినిమాకి, ఎలక్షన్స్ ఓ లింక్ ఏర్పడింది. తమిళ ఉగాది నాటు అంటే ఏప్రిల్ 14న కబాలి విడుదల చేయాలన్నది యూనిట్ ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే ఓసారి రిలీజ్ కు సంబంధించిన సమాచారం కూడా డిస్ట్రిబ్యూటర్లకు అందింది.

అయితే.. అదే సమయంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ చివర్లో కానీ, మే మొదట్లో కానీ తమిళనాడు అసెంబ్లీ పోల్స్ జరగనున్నాయి. వీటిలో రజినీకాంత్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోయినా.. ఆయన అభిమానుల్లో మెజారిటీ వర్గం అటు జయలలితతో, ఇటు కరుణానిధికో అండగా ఉండేవారే. అందుకే ఇలాంటి సమయంలో కబాలి రిలీజ్ చేయడం అంత కరెక్ట్ కాదని ఫీలైన రజినీకాంత్. చివరకు వెనక్కు తగ్గాలని డిసైడ్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కౌంటింగ్ ముగిసి రిజల్ట్ వచ్చేవరకూ సినిమా వాయిదా వేయాల్సిందిగా నిర్మాతను కోరారట సూపర్ స్టార్.

వాస్తవానికి ఇది వెనక్కు తగ్గడమే అయినా.. రజినీ మూవీ చాలా గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. చాలా మంది లైఫ్ ఆధారపడే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. ఎవరికీ నష్టం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ ఆడియోను మాత్రం ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే మార్చ్ లో విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News