హీరోల మార్కెట్ శాపంగా మారుతోందా?
సినిమా బడ్జెట్ కి కారణం కథ. స్టోరీ డిమాండ్ మేరకు ఖర్చు తప్పదు. రాజీ పడితే క్వాలిటీ పోతుంది. ఈ క్రమంలో బడ్జెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం అన్నది జరగదు.;
సినిమా బడ్జెట్ కి కారణం కథ. స్టోరీ డిమాండ్ మేరకు ఖర్చు తప్పదు. రాజీ పడితే క్వాలిటీ పోతుంది. ఈ క్రమంలో బడ్జెట్ పెరుగుతుందే తప్ప తగ్గడం అన్నది జరగదు. ఎక్కడా వృద్ధా ఖర్చు కాకుండా చూసుకుంటే తప్ప బడ్జెట్ ను అదుపు చేయడం కష్టం. సినిమా ప్లాప్ అవుతుందా? ఫెయిలవుతుందా? అన్నది ముందే అంచనా వేయడం అసాధ్యం కాబట్టి నిర్మాతకు ఈ ఖర్చు తప్పదు. దర్శకుడు అడిగినంత బడ్జెట్ ఇవ్వాల్సిందే. ఈ మొత్తం బడ్జెట్ ను హీరో మార్కెట్ ఆధారంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో ముందే లాగేస్తున్నారు నిర్మాతలు.
అందుకు గ్యారెంటీ మాత్రం లేదు:
థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ అంటూ ముందుగానే సినిమాను బిజినెస్ చేసేస్తున్నారు. దీంతో నిర్మాత సేఫ్ అవుతున్నాడు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోన్న హీరోలు ఎల్లప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటారు. కానీ సినిమా కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. కొన్ని టెర్మ్స్ అండ్ కండీషన్ ప్రకారం సినిమా రిలీజ్ చేసినా? అది అధికారికం కాదు. నిర్మాత-పంపిణీ దారుడి మధ్య ఉండే అండర్ స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కొంత మంది దర్శక, హీరోలు కూడా పంపిణీ దారుడికి బాద్యతగా ఉంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
ఓవర్ హైప్ తో వ్యాపారం:
డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా తర్వాత మరో సినిమా రూపంలో ఆ నష్టాలను కవర్ చేసేలా దిద్దుబాటు చర్యలు చేపడు తుంటారు. కానీ దీనికి గ్యారెంటీ అనేది ఉండదు. గాల్లో దీపంలాగే సన్నివేశం కనిపిస్తుంది. వివాదం ముదిరితే పంపిణీదారులు రోడ్డెక్కుతారు. దర్నాలు, నిరసనలు తెలియజేస్తారు. అయితే ఈ పరిస్థితి కారణం హీరోల మార్కెట్ అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. `కూలీ` సినిమాకి పెట్టిన బడ్జెట్ 500 కోట్లు. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 550 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ లాంగ్ రన్ లో రాబట్టింది 500 కోట్లు మాత్రమే.
పారితోషికం అందుకే తగ్గించమంటున్నారు:
`సలార్` చిత్రం హిట్ టాక్ వచ్చింది కానీ ఏరియాల వైజ్ గా చూస్తే ఆ సినిమా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఇంకా ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా కోలీవుడ్ నటుడు విజయ్ నటించిన `జన నాయగన్` రిలీజ్ అవుతుంది. విజయ్ చివరి చిత్రం ఇదే కావడంతో? ఈ సినిమా బిజినెస్ మూములుగా జరగలేదు. 500 కోట్ల వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. కానీ ఈ సినిమాకు అంత సత్తా ఉందా? అన్న సందేహాలు ఇప్పుడు తెరపైకి వస్తు న్నాయి. విజయ్ బొమ్మను చూసి కొనేసారు గానీ..కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంది? అన్నది ఎవరికీ తెలియంది. దాదాపు స్టార్ హీరోల చిత్రాలన్నింటికీ ఇలాగే జరు గుతోంది. హీరోల మార్కెట్ సినిమాలకు శాపంగానూ మారుతోందన్నది విశ్లేషకుల మాటగా వ్యక్తమవుతోంది. అందుకే హీరోలు పారితోషికం తగ్గించుకోవాలి? అన్న డిమాండ్ నిర్మాతల నుంచి నిరంతరం వ్యక్తమవుతోంది.