సూపర్ హీరోయిన్ ను అందుకోవడం కష్టమేనా?
సాధారణంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాలు రావడం చాలా అరుదు.;
సాధారణంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమాలు రావడం చాలా అరుదు. అయితే అందులో అవకాశం దక్కించుకొని సక్సెస్ అందుకున్న ప్రతి హీరోకి కూడా ఊహించని క్రేజ్ లభించింది. ఇకపోతే హీరోలకి సూపర్ హీరో కాన్సెప్ట్ లో అవకాశాలు రావడమే అరుదు అంటే.. అలాంటిది ఒక హీరోయిన్ సూపర్ హీరో కాన్సెప్ట్ లో సినిమా చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలిసారి సూపర్ హీరో క్యారెక్టర్ లో నటించిన తొలి హీరోయిన్గా రికార్డు సృష్టించింది ఈ సూపర్ హీరోయిన్. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా.. ఆమె కళ్యాణి ప్రియదర్శన్.
'లోక చాప్టర్ 1 : చంద్ర' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇదే సినిమాను తెలుగులో 'కొత్తలోక' అంటూ విడుదల చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళం సినీ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. అలా ఒక్క సినిమాతో ఊహించని విజయాన్ని దక్కించుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ను ఇప్పుడు అందుకోవడం కష్టమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న కళ్యాణి ప్రియదర్శన్ కు ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
ఇప్పటికే కోలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా మారిన కళ్యాణి ప్రియదర్శన్ కు మరో అవకాశం లభించినట్లు తెలుస్తోంది. జెన్నీ అనే చిత్రంతోపాటు తమిళ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న మార్షల్ అనే సినిమాలో కూడా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. పైగా ప్రస్తుతం మరో కొన్ని ప్రాజెక్టులను ఈమె పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉమెన్ సెంట్రిక్ సూపర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వచ్చిన కొత్తలోక సినిమాతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణి ప్రియదర్శన్ కి ఇప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతూ ఉండడంతో కొత్త డైరెక్టర్లు ఈమెను అందుకోవడం కష్టమే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కళ్యాణి కెరియర్ మరింత బిజీగా మారిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. 2017లో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈ తెలుగు చిత్రాల తర్వాతనే ఈమెకు తమిళంలో అవకాశం లభించింది. అలా తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలలో నటిస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది కళ్యాణి ప్రియదర్శన్.
కళ్యాణి ప్రియదర్శన్ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, ప్రముఖ నటి లిస్సి దంపతులకు 1992 ఏప్రిల్ 5న జన్మించింది. న్యూయార్క్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ కూడా పూర్తి చేసింది కళ్యాణి ప్రియదర్శన్.