• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరీ ఇలా షాకిస్తాడని...

మరీ ఇలా షాకిస్తాడని ఊహించలేదట

By - Tupaki Desk
Update: 2018-11-24 10:49 GMT
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘2.ఓ’ చిత్రం సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 2.ఓ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల డైరెక్ట్‌ సినిమా కంటే ఎక్కువ అంచనాల నడుమ విడుదల అవుతోంది. 2.ఓ హడావుడి ముగిసిన వెంటనే ‘పేట్ట’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ చిత్రం షూటింగ్‌ సమ్మర్‌ లోనే ప్రారంభం అవ్వడంతో వచ్చే ఏడాది సమ్మర్‌ కు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

‘పేట్ట’ చిత్రం షూటింగ్‌ శరవేంగా దర్శకుడు కార్తీక్‌ పూర్తి చేసి జనవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే జనవరి అంటున్నారు కాని - ఎలాగూ పేట్ట వాయిదా పడటం ఖాయమని అనుకున్నారు. రజినీకాంత్‌ ఏ సినిమా కూడా ఈమద్య కాలంలో ముందుగా ప్రకటించిన తేదీకి రాలేదు. అలాగే పేట్ట కూడా రాదని అంతా అనుకున్నారు. కాని రజినీకాంత్‌ సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లుగా మరోసారి చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక క్లారిటీ వచ్చింది.

రజినీ ఎలాగూ జనవరిలో రాడనుకుని పలు సినిమాలు సంక్రాంతికి - రిపబ్లిక్‌ డే కు విడుదలకు సిద్దం అవుతున్నాయి. తమిళంతో పాటు తెలుగు సినిమాలు కూడా ‘పేట్ట’ వల్ల ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోబోతున్నాయి. రజినీకాంత్‌ మూవీ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. మరో వైపు సంక్రాంతికి పెద్ద సినిమాలైన ‘వినయ విధేయ రామ’ - ‘ఎఫ్‌ 2’ - ‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు’ ఇంకా పలు చిన్నా పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ఈ చిత్ర మేకర్స్‌ షాక్‌ కు గురవుతున్నారు. రజినీ వస్తే పరిస్థితి ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు. తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని తమిళం మరియు తెలుగులో రజినీకాంత్‌ సినిమాలు ఒకే సారి విడుదల అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా అక్కడ - ఇక్కడ కూడా ఒకేసారి అదే పొంగల్‌ కు రజినీ రంగంలోకి దిగడం ఖాయం. ఇక్కడ సినిమాల షెడ్యూల్స్‌ అంత గందరగోళం అవ్వడం పక్కా అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Rajinikanth 
  • Petta Movie 
  • TElugu NEws 

Similar News

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

Copyright @2026

Powered by Blink CMS