అతడితో రజినీ సినిమా.. ఎగ్జైటింగే
ఆల్రెడీ రాజకీయ పార్టీ ప్రకటించేశాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక పార్టీ పేరు.. ఇతర వివరాలు ప్రకటించి పూర్తి స్థాయిలో రాజకీయ రణరంగంలోకి దిగడమే ఆలస్యం అనుకుంటున్నారంతా. ఆయన వయసు.. ఆరోగ్యం దృష్ట్యా ఇంకో సినిమా చేసే అవకాశాలు లేవనే భావించారు. కానీ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో అనూహ్యంగా ఒక సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు రజినీ. ఈ వార్తను జీర్ణించుకోవడానికి జనాలకు ఒక రోజు పట్టింది. ఇది పక్కా ప్రాజెక్టు అన్నాక ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందనే డిస్కషన్లు మొదలయ్యాయి.
ఈ దశాబ్ద కాలంలో దక్షిణాదిన పరిచయమైన దర్శకుల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ యంగ్ టాలెంట్స్.. కార్తీక్ సుబ్బరాజ్. తొలి సినిమా ‘పిజ్జా’ కానీ.. మలి సినిమా ‘జిగర్ తండ’.. ఆ తర్వాత తీసిన ‘ఇరైవి’.. ఇలా వేటికవే క్లాసిక్స్ గా గుర్తింపు పొందాయి. అందులోనూ తొలి రెండు సినిమాల ప్రత్యేకతే వేరు. వీటిలో స్టాండ్ ఔట్ అనిపించేది ‘జిగర్ తండ’. ఆ సినిమా కథ.. కథనం.. క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా కొత్తగా.. సెన్సేషనల్ గా ఉంటాయి. ఆ సినిమా చూసే రజినీ కూడా ఫిదా అయిపోయాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రతో బాబీ సింహా జాతీయ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ పాత్రకు నన్నెందుకు తీసుకోలేదంటూ రజినీ అప్పట్లో సీరియస్ గానే తనను అడిగాడని.. తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడని కార్తీక్ ఇంతకుముందు వెల్లడించాడు. అప్పుడే రజినీతో సినిమా కోసం అతను కథ తయారు చేసుకోవడం మొదలుపెట్టినట్లున్నాడు. విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కార్తీక్ రజినీ లాంటి మాస్ సూపర్ స్టార్ ను ఎలా డీల్ చేస్తాడు.. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుంది అన్నది క్యూరియాసిటీ పెంచే విషయాలే. నిజానికి కార్తీక్ తన తర్వాతి సినిమాను ధనుష్ హీరోగా చేయాల్సింది. ఈ సినిమా గురించి ప్రకటన కూడా వచ్చింది. మరి ఆ సినిమా చేసి రజినీతో మూవీ మొదలుపెడతాడా.. లేక రజినీతో అయ్యాక అతడి అల్లుడి సినిమాకు శ్రీకారం చుడతాడా అన్నది తెలియాల్సి ఉంది.