• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ర‌జ‌నీ-క‌మ‌ల్ క్రేజీ...

ర‌జ‌నీ-క‌మ‌ల్ క్రేజీ మూవీ.. ఫ్యాన్స్ కి నిరాశేనా?

By - Tupaki Desk
Update: 2020-05-15 04:15 GMT
కొన్ని క‌ల‌యిక‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అభిమానుల్లో ఉత్సాహం పెంచుతాయి. అలాంటి రేర్ కాంబినేష‌న్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో సాధ్య‌మ‌వుతుంద‌నే భావించారంతా. కానీ ఆదిలోనే హంస‌పాదులా అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి అన్న చందంగా అయ్యింది ఆ ప్రాజెక్ట్. అస‌లింత‌కీ ఇదంతా ఎవ‌రి గురించి? అంటే.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్ గురించి. స్నేహితులిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది.

కమల్ హాసన్ రాజ్ కమల్ ప్రొడక్షన్స్ లో న‌టించేందుకు రజనీకాంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. దీనికి ఖైదీ (ఖైథీ) ఫేం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని కూడా ప్ర‌చార‌మైంది. అయితే ఈ సినిమా సాధ్యం కాక‌పోవ‌చ్చ‌న్న‌ది తాజా స‌మాచారం. అలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏమై ఉండొచ్చు. స్నేహితులిద్ద‌రి మ‌ధ్యా పొస‌గ‌లేదా? ఎందుక‌ని ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.. అంటే అందుకు ఓ ఆస‌క్తిక‌ర కార‌ణ‌మే ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే త‌లైవా రజనీకాంత్ ఇక‌పై పూర్తి సమయం రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. అందుకే త‌లైవా 169 ని  నిర్మించే అవ‌కాశం క‌మ‌ల్ హాస‌న్ కి లేకుండా పోయింద‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి.

రాజ‌కీయాల వ‌ల్ల‌నే ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యే ఛాన్సుంద‌ని చెబుతున్నారు. ఖైథీ చిత్రం చూసిన ర‌జ‌నీ లోకేష్ కనగరాజ్ ను గొప్ప‌గా ప్ర‌శంసించారు. త‌న‌తో క‌లిసి ఓ సినిమా చేస్తాన‌ని ఆశ పెట్టారు. కానీ ఆ ప్రామిస్ ని నెర‌వేర్చే అవ‌కాశం లేద‌ని తాజాగా తెలుస్తోంది. ఖైథీ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు నచ్చ‌డం వ‌ల్ల‌నే కమల్ హాసన్ కూడా ర‌జ‌నీ-క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ పై మంచి హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింద‌ని చెబుతున్నారు. ఇది అభిమానుల‌కు తీవ్రంగా నిరాశ క‌లిగించేదే.

రజనీకాంత్ చివరిసారిగా ఏ.ఆర్.మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలోని ద‌ర్బార్ చిత్రంలో న‌టించారు. తదుపరి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న `అన్నాట్టే`లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార- కీర్తి సురేష్- ఖుష్బు సుందర్‌ -మీనా కథానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ప్రకాష్ రాజ్- సూరి - సతీష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తెర‌కెక్కుతోంది. COVID 19 విజృంభ‌ణ‌తో లాక్ డౌన్ వ‌ల్ల నిలిచిపోయింది.

మరోవైపు కమల్ హాసన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న `భార‌తీయుడు 2` (ఇండియన్ 2) లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ర‌కుల్ క‌థానాయిక‌లు. సిద్ధార్థ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సెట్స్‌లో ప్రమాదం ఇబ్బంది పెట్టింది. లోకేష్ కనగరాజ్ ప్ర‌స్తుతం `మాస్టర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తూ బిజీగా ఉన్నారు. విజయ్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. విజయ్ సేతుపతి ప్రధాన విల‌న్ గా క‌నిపించనున్నాడు. మాలవికా మోహనన్- ఆండ్రియా జెరోమియా నాయిక‌లుగా న‌టిస్తున్నారు.
Tags:    
  • Rajinikanth and Kamal Haasan to join hands for a film after 35 years 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS