కబాలి కారు నంబరుకు 8 లక్షలు

Update: 2016-07-25 10:44 GMT
రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' దేశవ్యాప్తంగా చర్చనీయమైన సినిమాగా మారింది.. సినిమా విడుదల తరువాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా రజనీ మేనియా నుంచి మాత్రం అభిమానులు ఇంకా బయటపడడం లేదు. కబాలి ఫీవర్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది. తాజాగా  తమిళనాడుకు చెందిన రజనీ వీరాభిమాని ఒకరు తన కారుకు 'కబాలి' నంబరుగా చేసుకున్నాడు. ఓ ఆడీ కారును కొనుగోలు చేసిన ఆ అభిమాని దాని నంబరును కబాలి అని ఇంగ్లీష్ లో కనిపించేలా రాయించాడు.

 ఇందుకోసం ఆయన కర్ణాటక వెళ్లి అక్కడ రిజిస్టరు చేశాడు. దీనికోసం కర్ణాటక వెళ్లడం ఎందుకు అనుకుంటున్నారు.. కర్ణాటకలో అయితే.. స్టార్టింగ్ కేఏ సిరీస్ వస్తుంది. దీంతో కర్ణాటకలో రిజిస్ట్రేషన్ చేయించి  'కేఏ 8 ఏఎల్ 1' నంబరును తీసుకుని దాన్ని 'KABALI' అని కనిపించేలా స్టిక్కరింగ్ చేయించాడు. పక్కనే రజనీకాంత్ చిత్రాన్ని జోడించి మరీ చక్కర్లు కొడుతున్నాడు.

అయితే.. ఈ నంబరు ఆయనకు అంత సులభంగా దక్కలేదు. వేలంలో ఏకంగా 8 లక్షలు పెట్టి తీసుకున్నాడు. ఇప్పుడాయన తన కబాలి కారులో రాజసంగా తమిళనాడు వీధుల్లో తిరుగుతున్నారు.  ఆ కారు కనిపిస్తే చాలు జనాలు దాని నంబరు ప్లేటు ఫొటో తీసి ఫేస్ బుక్ లో పెట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడీ కబాలి కారు బాగా పాపులర్ అయింది.
Tags:    

Similar News