సంక్రాంతికే 'శేఖ‌ర్' ఫిక్స్ అయ్యాడా!

Update: 2022-01-03 07:51 GMT
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో మీడియం రేంజ్ సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రో పాన్ ఇండియా చిత్రం డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన `రాధేశ్యామ్` కూడా రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో చిన్న సినిమాలు క్యూ క‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో అంతా థియేట‌ర్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. ఓటీటీ ఆప‌ర్లు వ‌స్తున్నా..తాడో పేడో థియేట‌ర్లోనే తేల్చుకోవాడానికి రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 14న ఐదారు రిలీజ్ లు క‌న్ఫామ్ అయ్యాయి.

`డీజీ టిల్లు`...`సూప‌ర్ మ‌చ్చి`..`7 డేస్ 6 నైట్స్` స‌హా మ‌రికొన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. స‌రిగ్గా సంక్రాంతి పండుగ రోజున ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తోన్న `శేఖ‌ర్` చిత్రం సంక్రాంతి సీన్ లో కి వ‌చ్చింది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఫ‌స్ట్ కాపీ కూడా సిద్ద‌మైంది.

అందుకే రిలీజ్ కి రెడీ అవుతున్నారు. బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తికావొచ్చాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఓటీటీ నుంచి 25 కోట్ల ఆఫ‌ర్ కూడా వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అయినా థియేట‌ర్లోనే రిలీజ్ చేయాల‌ని భావించ‌డంతో ఆఫ‌ర్ వ‌దులుకున్న‌ట్లు తెలుస్తోంది.

రిలీజ్ కి ఇదే సీజ‌న్ స‌రైన‌ద‌ని భావించి డేట్ లాక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అయితే ఇప్ప‌టివ‌రకూడా డేట్ ఫైన‌ల్ కాలేదు. జ‌న‌వ‌రి 14న కొన్ని సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. కాబట్టి అంత‌కు ముందే `శేఖ‌ర్` థియేట‌ర్లోకి వ‌చ్చేస్తే వ‌ర్కౌట్ అవుతుంది. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌ల‌లో `పుష్ప` స‌హా ఇంకొన్ని చిన్న సినిమాలు ర‌న్నింగ్ లో ఉన్నాయి. శేఖ‌ర్ సినిమాకి మంచి బ‌జ్ కూడా ఉంది కాబ‌ట్టి రిలీజ్ అయితే స‌క్సెస్ ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి. అందుకే రాజ‌శేఖ‌ర్ ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవిత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం.
Tags:    

Similar News