ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న రాజమౌళి 'రామాయణం'..!
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని అందరు నటీనటులు కోరుకుంటాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆయన డైరెక్షన్ లో వర్క్ చేయాలని ఆశపడుతుంటారు. జక్కన్న తన ఆలోచలను సినిమాలుగా మలిచి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ మన జక్కన్నని ఒక ఎపిక్ సినిమాకి డైరెక్షన్ చేయమని సోషల్ మీడియాలలో నేషనల్ వైడ్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే టీవీ ప్రేక్షకుల కోసం దూరదర్శన్ లో ప్రసారమైన ‘రామాయణం’ అప్పట్లో బాగా పాపులర్. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పౌరాణిక సీరియల్ ఇది. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన 'రామాయణం' సీరియల్ ను ఈ లాక్ డౌన్ సమయంలో దూరదర్శన్ రీ-టెలీకాస్ట్ చేసిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల తరవాత కూడా ఈ సీరియల్ ను భారత ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ సీరియల్ కారణంగా దూరదర్శన్ ఎప్పుడూ లేని విధంగా టీఆర్పీలో అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 77 మిలియన్ల మంది ‘రామాయణం’ను వీక్షించారు. దీంతో 19 మిలియన్ల వ్యూస్ రికార్డ్ ఉన్న 'గేమ్ ఆఫ్ త్రోన్స్' రికార్డ్ కూడా ఈజీగా లేచిపోయింది.
కాగా ఇప్పుడు దూరదర్శన్ లో ‘రామాయణం’ ‘ఉత్తర్ రామాయణం’ సీరియల్స్ టెలీకాస్ట్ పూర్తయింది. దీంతో ఇప్పుడు ‘రామాయణం’ ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘రామాయణం’ను రీమేక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో రాజమౌళి మోత మొదలైంది. #RajamouliMakeRamayan హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఇది టాప్ ట్రెండ్ లో ఉంది. ప్రస్తుతం ‘రామాయణం’ మహాకావ్యాన్ని తెరపై ఆవిష్కరించగల ఏకైక దర్శకుడు రాజమౌళి అని కీర్తిస్తున్నారు. ఆయన తప్ప ఇండియాలో మరో దర్శకుడు రామాయాణాన్ని అంత గొప్పగా తెరకెక్కించలేరని కితాబిస్తున్నారు. ఇప్పటికే 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని జక్కన్న ప్రకటించారు. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యి 'మహాభారతం' సెట్స్ పై వెళ్లాలంటే కనీసం 3 నుండి 4 ఏళ్లు పడుతుంది. మరి నార్త్ ఇండియన్స్ కోరికను పరిగణలోకి తీసుకొని 'రామాయణం' తెరకెక్కించడానికి పూనుకుంటాడేమో చూడాలి. ఇదిలా ఉండగా రాజమౌళి ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' అనే భారీ మల్టీస్టారర్ తీస్తున్నాడు. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని ఇప్పటికే ప్రకటించేసాడు.