బాహుబలి2 పై జక్కన్న ట్వీట్

Update: 2016-10-22 13:13 GMT
అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. ఆ ముందు రోజు.. అంటే ఇవాళ బాహుబలి2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆడియన్స్ కి చాలా రోజుల ముందే చెప్పాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఓ రెండు రోజుల ముందు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ పెట్టాడు.

గతేడాది మే నెల 1వ తేదీ నుంచి బాహుబలి హంగామా స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఒక్కో కేరక్టర్ ను విడుదల చేస్తూ.. సినిమాపై హైప్ అకాశమంత స్థాయికి వెళ్లేలా చేశారు. బాహుబలి ది బిగినింగ్ కి ఫస్ట్ లుక్ ఇచ్చేముందు ఒకే ఒక్క ట్వీట్ తో దాని రేంజ్ ఏంటో చెప్పాడు జక్కన్న. 'ప్రతీ కథకు కీలకంగా ఓ సింగిల్ పాయింట్ ఉంటుంది. అదే మొత్తం కథను బాహుబలి ది బిగినింగ్ ను నడిపిస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.

ఇప్పుడు బాహుబలి2 ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందు 'తన ఎదురులేని శక్తిని ఉపయోగించి మాహిష్మతి రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడన్నదే బాహుబలి2 ది కంక్లూజన్' అంటూ..  ఒకే వాక్యంలో బాహుబలి2 సీక్వెల్ గురించి చెప్పాడు జక్కన్న. అంతేనండీ.. అంతకు మించి సినిమా గురించి ఏం చెప్పలేదు.. ముఖ్యంగా కట్టప్ప గురించి అయితే కొత్త ట్వీట్ కూడా పెట్టలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News