ఏడు నెలల గ్యాప్‌ తర్వాత సెట్స్‌ లో అడుగు పెట్టిన జక్కన్న

Update: 2020-10-05 12:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్‌ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌ లో జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. మార్చి నెలలో లాక్‌ డౌన్‌ కు ముందే ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. అప్పటి నుండి అదుగో ఇదుగో అంటూ ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. జులై నెలలో ఈ సినిమాను తక్కువ మంది నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులతో ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఆసమయంలో వీలు పడలేదు. ఆ తర్వాత రాజమౌళి కరోనా బారిన పడటం వల్ల మరోసారి వాయిదా పడింది.

ఎట్టకేలకు హైదరాబాద్‌ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ను నేటి నుండి ప్రారంభించారు. మొదటి మూడు రోజులు టెస్ట్‌ షూట్‌ జరుగనుందట. ఆ తర్వాత ఎన్టీఆర్‌ షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతున్నాడు. ఎన్టీఆర్‌ పై ప్రోమో వీడియోను చిత్రీకరించడంతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ నెల చివర్లో రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్‌ ను ముగించే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాను వచ్చే ఏడాది జులై లో లేదా దసరా కానుకగా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News