థాంక్స్ టు ఈగ - రాజమౌళి

Update: 2015-10-07 04:31 GMT
దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ వేదికపై అసాధారణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా బాహుబలి చలవే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అంతకుముందే 2012లో వచ్చిన ఈగ సినిమానే జక్కనలోని క్రియేటివ్ దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. రాజమౌళికి అంతర్జాతీయ గుర్తింపు రావడానికి బీజం పడింది ఈగ సినిమాతోనే అన్నది అక్షరసత్యం. అయితే బాహుబలి పెద్ద కాన్వాస్ పై కనపడి ప్రేక్షకలోకాన్ని మరింత మురిపించింది. అసలు విషయానికొస్తే..

బాహుబలి సినిమాని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే సౌత్ కొరియాలోని బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ఈ సినిమాని మొన్న 4వ తేదీన ప్రదర్శించారు. ఈ అపురూప దృశ్యాలను చూసిన అక్కడి ప్రేక్షకులు ఆహా.. ఓహో అంటూ మన సినిమాని మెచ్చుకున్నారు. అనంతరం దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా దర్శకుడు వేరెవరో కాదు. ఇదివరకు 'ఈగ'తో అద్భుతాలు చేయించిన వారే అంటూ రాజమౌళిని పరిచయం చేశారు. ఈగ సినిమా కూడా అక్కడ (బుసాన్ లో) 2012 లో ప్రదర్శితమైంది. ఈగ దర్శకుడనేసరికి వాళ్ళ కళ్ళు మరింత పెద్దవి చేసుకుని జక్కన్నని చూడడం మొదలెట్టారట.

ఆ తర్వాత ఆ దేశంలో వున్న మన భారతీయులతో సహా మరికొంతమంది ఈగ సినిమా డీవీడీ లపై రాజమౌళి సంతకాలు, ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎగబడ్డారు.ఈ వివరాలన్నీ నెల తర్వాత స్వదేశంలో అడుగెట్టిన రాజమౌళి ఎంతో ఆనందంగా వుందంటూ ఫేస్బుక్ లో చెప్పుకొచ్చారు. దాంతోపాటు తనకు ఈ స్థాయి గుర్తింపు తెచ్చిన ఈగకు థాంక్స్ చెప్పారు. అలా ఆయన సృష్టించిన ఈగను ఓసారి స్మరించుకున్నారు
Tags:    

Similar News