'ధురంధర్' తో పూర్వవైభవం వచ్చేసినట్టేనా?
ఒక్క సారిగా యావత్ ప్రపంచం బాలీవుడ్ పైపు ఆశ్చర్యంతో తిరిగి చూసేలా చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.;
రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్'. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. గల్ఫ్ దేశాలలో బ్యాన్ చేసినా కేవలం మౌత్ టాక్‌తో ఈ సినిమా ఊమించని విధంగా రూ.1400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఒక్క సారిగా యావత్ ప్రపంచం బాలీవుడ్ పైపు ఆశ్చర్యంతో తిరిగి చూసేలా చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.
ఈ మూవీ సాధించిన సంచలన విజయం నేపథ్యంలో సీక్వెల్‌గా వస్తున్న `ధురంధర్ ది రివేంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. టీజర్, ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉండటం, ఇండియన్ సినిమాల్లో ఇంత వరకు చూడని హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలు ఉండటం, రణ్ వీర్‌సింగ్ బీస్ట్ అవతార్‌ని ఓ రేంజ్‌లో చూపించడంతో సహజంగానే 'ధురంధర్ 2' పై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలతో బాలీవుడ్ షైన్ అవుతోందని, మళ్లీ పుంజుకుంటోందనే చర్చ మొదలైంది.
గతంలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే టాక్ ఉండేది. కానీ 'బాహుబలి' తరువాత ఆ భావన అందరిలోనూ తొలగిపోవడం, దృష్టి మొత్తం సౌత్ వైపు తిరగడం..ఇదే సమయంలో కరోనా కారణంగా ఉత్తరాది ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలపై ఆసక్తిని చూపించకపోవడంతో క్రమ క్రమంగా బాలీవుడ్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో రిలీజ్ అయినా సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో బాలీవుడ్ తన ప్రాభవాన్ని, ప్రేక్షకుల్లో క్రేజ్‌ని కోల్పోయి ధీన స్థితికి చేరుకుంది.
ఆ టైమ్‌లో సన్నీడియోల్ `గదర్ 2` రూ.690 కోట్లకు పైనే రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇదే ఊపులో వచ్చిన షారుక్ ఖాన్ `పఠాన్ రూ.1000 కోట్లకు పైనే రాబట్టి బాలీవుడ్‌కు సరికొత్త జోష్‌ని తీసుకొచ్చింది. అజయ్ దేవగన్ `దృశ్యం2` కూడా సూపర్ హిట్ అనిపించుకుని మంచి వసూళ్లని రాబట్టింది. ఇక అదే ఏడాది విడుదలైన రణ్‌బీర్ కపూర్ `యానిమల్` రూ.900 కోట్లకు మించి రాబట్టడంతో బాలీవుడ్ పుజుకోవడం మొదలు పెట్టింది. ఆ తరువాత షారుక్ `జవాన్` సక్సెస్ సాధించిన మరింత ఊపునిచ్చింది.
2024లో శ్రద్ధా కపూర్ స్ట్రీ2, కార్తిక్ ఆర్యన్ 'భూల్ భులయ్యా 3' వరుసగా సూపర్ హిట్‌లు, బ్లాక్ బస్టర్‌లు కావడం తెలిసిందే. అయితే ఆ తరువాత విడుదలైన సినిమాల్లో చాలా వరకు బాలీవుడ్‌ని తీవ్ర నిరాశకు గురి చేసి మళ్లీ ట్రాక్ తప్పేస్తున్నామా? అనే అనుమానాల్ని కలిగించాయి. అయితే రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్` మాత్రం బాలీవుడ్ ని మరింత షైన్ అయ్యేలా చేసింది. అండర్ డాగ్‌లా సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని బాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసింది. మార్చి 19న విడుదలవుతున్న `ధురంధర్ 2` ప్రీమియర్‌లతో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ కు పూర్వవైభవం వచ్చేసినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రేజ్‌ని `రామాయణ`, కింగ్, మాతృభూమి వంటి సినిమాలు కొనసాగించడం ఖాయమని తెలుస్తోంది.