మ‌హేష్ నిర్ణ‌యంపై రాజ‌మౌళి ప్ర‌శంస‌లు

Update: 2021-12-21 12:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సంక్రాంతి రిలీజ్ ల విష‌యంలో నెల‌కొన్న పోటీని వారించ‌డంలో చొర‌వ తీసుకున్నందుకు మ‌హేష్ ని ఈ సందర్భంగా అభినందించారు.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `RRR`. యంగ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొల‌సారి క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ ఇది. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన `RRR` ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ రేసులో ప్ర‌భాస్ `రాధేశ్యామ్‌` కూడా పోటీప‌డుతోంది. ఈ మూవీ జ‌న‌వ‌రి 14న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు చిత్రాల‌కు పోటీ వుండకూడ‌ద‌ని భావించిన మేక‌ర్స్ ఈ పోటీ నుంచి `భీమ్లా నాయ‌క్‌` చిత్రాన్ని త‌ప్పించారు. ఉద‌యం ఈ విష‌యాన్ని దిల్ రాజు వెల్ల‌డించారు.

ఇదిలా వుంటే అంతా అనుకున్న‌ట్టుగా జ‌రిగితే మ‌హేష్ బాబు న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌`ని జ‌న‌వ‌రికే విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించింది. తాజాగా ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న చిత్రాన్ని మ‌హేష్ సమ్మ‌ర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. తాజా రిలీజ్ డేట్ ప్ర‌కారం `స‌ర్కారు వారి పాట‌` ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతోంది.

త‌న సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకున్న నేప‌థ్యంలో రాజ‌మౌళి .. హీరో మ‌హేష్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. `స‌ర్కారు వారి పాట‌` సంక్రాంతికి ప‌ర్ఫెక్ట్ సినిమా అయిన‌ప్ప‌టికీ దాన్ని వేస‌వికి మార్చి ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టంచాడు. నా హీరో, టీమ్ మొత్తాన‌కి నా అభినంద‌న‌లు` అని రాజ‌మౌళి ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతే కాకుండా దిల్ రాజు గారు, `ఎఫ్ 3` టీమ్ సినిమా రిలీజ్‌ని వాయిదా వేసుకున్నందుకు వారికి కూడా నా అభినంద‌న‌లు అని, చిన‌బాబు గారు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ ని కూడా వాయిదా వేసుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని, ఈ సంద‌ర్భంగా ఈచిత్ర బృందానికి మంచ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని ట్వీట్ చేశారు.

`స‌ర్కారు వారి పాట‌` ముందు అనుకున్న ప్ర‌కారం జ‌న‌వ‌రికి రావాల్సింది. అయ‌తే హీరో మ‌హేష్ కు `స్పైడ‌ర్‌` సినిమా స‌మ‌యంలో జ‌రిగిన మోకాలి గాయానికి మైన‌ర్ స‌ర్జ‌రీ జ‌ర‌గ‌డంతో ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డింది.

మ‌హేష్ మ‌ళ్లీ సెట్స్ కి రావాలంటే క‌నీసం రెండు నెలలైనా ప‌డుతుంది. ఈ కార‌ణం వ‌ల్లే `స‌ర్కారు వారి పాట‌` ని సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పించి రిలీజ్ ని ఏప్రిల్ 1కి మార్చార‌ట‌. ఇది రాజ‌మౌళికి క‌లిసి రావ‌డంతో మ‌హేష్ పై జ‌క్క‌న్న ప్ర‌శంస‌లు కురిపించారు.
Tags:    

Similar News