పన్ను మినహాయింపు.. బన్నీ ఘనతేనా?

Update: 2015-10-10 06:19 GMT
‘రుద్రమదేవి’ సినిమా రిలీజైంది. జనాలంతా రుద్రమదేవి గురించి కాకుండా గోన గన్నారెడ్డి గురించే మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ గురించి.. ఆ పాత్రకు రాసిన డైలాగుల గురించే చర్చించుకుంటున్నారు. సినిమాకు ఓవరాల్ గా డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. ఈ క్యారెక్టర్ విషయంలో మాత్రం అందరిదీ ఒకటే మాట.. సూపర్బ్. సినిమాలో ‘రుద్రమదేవి’ని కాపాడే బాధ్యత తీసుకున్నట్లే.. సినిమాను కాపాడే బాధ్యత కూడా గోన గన్నారెడ్డి పాత్రే తీసుకున్నట్లుందిప్పుడు. రెండో రోజు కూడా కలెక్షన్లు డ్రాప్ అవలేదంటే అది అల్లు అర్జున్ ఘనతే అనడంలో సందేహం ఏమీ లేదు.

ఐతే తెరమీద ఓ రేంజిలో పెర్ఫామ్ చేసి సినిమాను కాపాడుతున్న అల్లు అర్జున్ తెర వెనుక కూడా హీరో అయ్యాడని అంటున్నాడు రాజమౌళి. ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణలో పన్ను మినహాయింపు రావడం వెనుక బన్నీనే కారణం అని జక్కన్న చెప్పాడు. ‘‘సినిమాకు పన్ను మినహాయింపు రావడంలో బన్నీ కీలక పాత్ర పోషించాడని విన్నాను. స్క్రీన్ మీద అల్లు అర్జున్ అదరగొట్టాడు. ఇప్పుడు తెర వెనుక కూడా అతను హీరో అని తెలిసింది’’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు. ఐతే పన్ను మినహాయింపు కోసం గుణశేఖర్ తో పాటు కేసీఆర్ దగ్గరికి వెళ్లకుండానే తెరవెనుక మంత్రాంగం నడిపి.. పన్ను మినహాయింపుకు కారణమయ్యాడన్నమాట బన్నీ.
Tags:    

Similar News