హృతిక్ ని ఆ మాట అనాల్సింది కాదు!-రాజమౌళి
తప్పును ఒప్పుకోవడం.. పశ్చాత్తాప పడడం .. అంతకుమించినది ఇంకేం ఉంటుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి అలాంటి ఒక సన్నివేశం ఎదురైంది. ఆయన పశ్చాత్తాపం చెందారు. స్టార్ హీరో విషయంలో తాను తప్పుగా వ్యాఖ్యానించానని అంగీకరించారు.
పదిహేనేళ్ల క్రితం SS రాజమౌళి హృతిక్ రోషన్ ను ప్రభాస్ తో పోల్చిన పాత వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. చాలా ఆలస్యంగా వచ్చినా ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. జక్కన్న వ్యాఖ్య సోషల్ మీడియాల్లోను సునామీగా మారింది. అభిమానుల్లో డివైడ్ ఫ్యాక్టర్ కి కరణమైంది. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ `ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్!` అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పాత వీడియోని కొత్తగా వైరల్ చేస్తూ పలువురు తప్పు పడుతున్నారు.
ఎట్టకేలకు ఇది తన దృష్టికి రావడంతో రాజమౌళి దీనిపై క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో తన పదాల ఎంపిక తప్పు అని .. హృతిక్ ను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల రెడ్ కార్పెట్ పై రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ- ``ఇది చాలా కాలం క్రితం నాటి వీడియో. 15-16 సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను. కానీ నా పదాల ఎంపిక సరిగా లేదు. నేను దానిని అంగీకరించాలి. అతనిని ఎప్పుడూ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. నేను అతనిని చాలా గౌరవిస్తాను. ఇది చాలా కాలం క్రితం నాటిది`` అని వివరణ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యానం చూశాక వెంటనే అభిమానులు రాజమౌళి తన తప్పును అంగీకరించినందుకు ప్రశంసించారు. జక్కన్న చాలా వినయశీలి అంటూ ప్రశంసించారు. పాత వీడియో క్లిప్ లో రాజమౌళి ఏమన్నారు? అంటే... ``రెండేళ్ల క్రితం ధూమ్ 2 విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇంత నాణ్యమైన చిత్రాలను ఎందుకు తీయగలదు? అని నేను ఆశ్చర్యపోయాను. హృతిక్ రోషన్ లాంటి హీరోలు మనకు లేరా? ఇప్పుడే బిల్లా పాటలు- పోస్టర్-ట్రైలర్ చూశాను. ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్!`` అని అన్నారు.
ప్రస్తుతం RRR ఆస్కార్ రేసులో ఉన్న క్రమంలో రాజమౌళి వ్యాఖ్యలు అంతర్జాలంలో వైరల్ కావడం ఆశ్చర్యపరిచింది. ఇటీవలి కాలంలో అతిపెద్ద భారతీయ బ్లాక్ బస్టర్ లలో ఒకటైన ఆర్.ఆర్.ఆర్ నుంచి `నాటు నాటు..` ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది. RRR టీమ్ ఇప్పుడు ఆస్కార్స్ పై దృష్టి సారించింది. అభిమానులు ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా పురస్కారం గెలవాలని ప్రార్థిస్తున్నారు.