విజ‌య్ - ర‌ష్మిక‌ల డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కు డేట్ ఫిక్స్‌?

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రష్మిక మంద‌న్న వేరు వేరు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు.;

Update: 2025-12-29 12:50 GMT

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రష్మిక మంద‌న్న వేరు వేరు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి `రౌడీ జ‌నార్ధ‌న‌`. ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంవ‌గా నిర్మిస్తున్న పీరియాడిక్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేక‌ర్స్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు. స‌రికొత్త లుక్‌లో రౌడీగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస‌లో త‌ను డైలాగ్స్ చెప్పిన విధానం సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

దీనితో పాటు రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ పీరియాడిక్ యాక్ష‌న్ మూవీని చేస్తున్నాడు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. గీత గోవిందం, `డియ‌ర్ కామ్రేడ్` చిత్రాల త‌రువాత మ‌రోసారి విరిద్ద‌రు క‌లిసి న‌టించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రిపై కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌పై ఇద్ద‌రు స్పందించ‌లేదు. గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు షికారు చేశాయి.

ఇదిలా ఉంటే అక్టోబ‌ర్‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. హైద‌రాబాద్‌లోని విజ‌య్ స్వ‌గృహంలో ఇరు కుటుంబాల పెద్ద‌లు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్‌లా జ‌రిగిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టుగా అక్టోబ‌ర్‌లోనే వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ర‌ష్మిక మంద‌న్న‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల వివాహానికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేశార‌ని, డేట్‌ని కూడా ఫైన‌ల్ చేయ‌డ‌మే కాకుండా డెస్టినేష‌న్ వెడ్డింగ్ కోసం ప్ర‌త్యేకంగా ప్లేస్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

2026 ఫిబ్ర‌వ‌రి 26న ఉద‌య్‌పూర్ ప్యాలెస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌ల డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టుగా తెలిసింది. టాలీవుడ్‌లో క్రేజీ జోడీగా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్న‌, విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తూనే ఉన్నాయి. అలా వార్త‌లు షికారు చేసిన ప్ర‌తి సారి తాము మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. ఇక ర‌ష్మిక పెళ్లి వార్త‌ల‌పై స్పందిస్తూ `నేను ఈ వార్త‌ల‌ను ఇప్పుడే ధృవీక‌రించ‌లేన‌ని, అలాగ‌ని వీటిని ఖండించ‌లేన‌ని, పెళ్లి గురించి ఎప్పుడు ఎక్క‌డ మాట్లాడాలో అక్క‌డ మాట్లాడ‌తాను. క‌చ్చితంగా మీ అంద‌రితో పంచుకుంటాను. అంత‌కు మించి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేను` అని చెప్ప‌డం తెలిసిందే.

`పుష్ప 2`తో పాన్ ఇండియా వైడ్‌గా 2024లో సంద‌డి చేసిన ర‌ష్మిక అదే జోరుని 2025లోనూ కొన‌సాగించింది. విక్కీ కౌశ‌ల్‌తో త‌ను చేసిన `ఛావా` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత విడుద‌లైన కుబేర‌, రొమాంటిక్ హార‌ర్ కామెడీ మూవీ `థామా` బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ర‌ష్మిక‌కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్ర‌స్తుతం కాక్‌టైల్ 2, మైసా చిత్రాల్లో న‌టిస్తోంది. ఇవి రెండూ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    

Similar News