అనుకున్న సమయానికే..అంటే ఏంటి జక్కన్నా?
బాహుబలి.. ఈ పేరు ఉచ్చరించని భారతీయ సినీ ప్రేక్షకుడు ఉండడేమో. గత ఏడాది దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగిపోయింది. బాహుబలి మేనియా ఉత్తర భారతాన్ని కూడా ఊపేసింది. ఇప్పుడిక రెండో భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే మన జక్కన్న సినిమాల్ని ఎలా చెక్కుతాడో తెలుసు కాబట్టి.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడు తెలుస్తుందో పక్కాగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే షూటింగ్ అయితే మొదలైంది కానీ.. అది ఎలా సాగుతోంది, సినిమా ఎప్పటికీ పూర్తవుతుంది అన్న క్లారిటీ లేదు. ఐతే బాహుబలి కామిక్స్ రిలీజ్ చేయడం కోసం చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన జక్కన్న ‘బాహుబలి-2’ విశేషాల గురించి నాలుగు ముక్కలు మాట్లాడాడు.
ఆ విశేషాలు చెబుతూ.. సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుంది అన్నాడు. ఐతే ఈ ‘అనుకున్న’ సమయం ఏంటన్నదే కొంచెం అయోమయంగా ఉంది. బాహుబలి తొలి భాగం విడుదలయ్యే ముందు అయితే వచ్చే ఏడాది సరిగ్గా ఇదే సమయానికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకొస్తుందన్నాడు జక్కన్న. అంటే మళ్లీ జులైకల్లా సినిమా వచ్చేయాలి. అదైతే అసాధ్యం అన్నట్లే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇంకా ప్రధాన పాత్రధారులందరూ షూటింగుకే రాలేదు. షూటింగ్ నాలుగైదు నెలల్లో పూర్తి చేసేసినా.. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్, ఇతర కార్యక్రమాలకు నెలలు నెలలు సమయం పడుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి గత ఏడాది చెప్పిన మాటను పక్కనబెట్టేయాలి. బహుశా షూటింగ్ మొదలయ్యేటపుడు జక్కన్న అండ్ టీమ్ ఒక డేట్ అనుకుని ఉంటుందేమో. దాని ప్రకారం అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని జక్కన్న చెప్పదలుచుకున్నాడేమో. బహుశా అది 2017 వేసవి కావచ్చొన్నది అంచనా.