ఇలా చెప్ప‌డం వెన‌క అర్థ‌మేంటి జ‌క్క‌న్న?

Update: 2016-01-02 06:43 GMT
జ‌క్క‌న్న(రాజ‌మౌళి) ఏం చేసినా, ఏం చెప్పినా అందులో ప్ర‌త్యేక‌త ఉంటుంది. వెండితెర‌ విజువ‌ల్స్ క్రియేట్ చేయడంలో అత‌డు సిస‌లైన‌ బాహుబ‌లుడే. విజువ‌ల్‌ తో పెట్టి కొట్ట‌డం అంటే ఆయన‌కు చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు బాహుబ‌లి -2 కోసం అంతే సీరియ‌స్‌ గా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. అంత‌కంటే ముందే కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ మూడ్‌ ని బాగా ఎంజాయ్ చేశాడు. ప్ర‌భాస్ అభిమానుల‌కు మ‌రో విజువ‌ల్ ట్రీట్ ముందుంది అనే సంకేతాలిస్తూ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల్ని ప్లాన్ చేశాడు.

పాత వీడియోనే కొత్త‌గా చూపించాడు. బాహుబ‌లి మూవీలో శివుడు - అవంతిక జంట మంచు ప‌ర్వ‌తం సునామీ నుంచి త‌ప్పించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తారు. మంచు కొండ విరుచుకుప‌డి విధ్వంశం సృష్టిస్తున్న‌ప్పుడు శివుడు చాక‌చ‌క్యంగా ఓ రాక్‌ ని విడ‌గొట్టి దానినే ప‌డ‌వ‌గా ఉప‌యోగించేస్తాడు. అది మంచు ప‌ర్వ‌తం అంచున దూకుతూ ప్రేయ‌సీప్రియుల‌ను సుర‌క్షిత ప్రాంతానికి చేర్చుతుంది. చివ‌రికి ఎలాగోలా మంచు కొండ విధ్వంశాన్ని దాటేస్తాడు. ఆ స‌న్నివేశం రియ‌ల్ విజువ‌ల్ ట్రీట్‌. ఇంత‌వ‌ర‌కూ హాలీవుడ్‌ లోనే చూశాం అలాంటివి. మొద‌టిసారి బాహుబ‌లి సినిమాతో తెలుగులో చూడ‌గ‌లిగాం. ఇప్పుడు అదే వీడియోని 2016 శుభాకాంక్ష‌లు చెప్పాడు.

ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునే ఆ ప్రేమికుల జంట మీదుగా రేసింగ్ ఇన్ టు న్యూ ఇయ‌ర్‌ -  హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ టైటిల్స్ వేశాడు. దీనర్థం కొత్త సంవ‌త్స‌రంలో రేస్ మొద‌లైన‌ట్టేన‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. అటు బాలీవుడ్‌ లో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూలో ఉన్నాయి. త‌మిళ్ నుంచి స్టార్ డైరెక్ట‌ర్ రోబో-2 ఉంది. వీట‌న్నిటినీ కొట్టేసే సినిమా తీస్తున్నా అని చెప్ప‌క‌నే చెప్పాడు జ‌క్క‌న్న‌. ఇప్పుడ‌ర్థ‌మైందా?  కొత్త సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు చెప్ప‌డం వెన‌క అస‌లు అర్థం.

Tags:    

Similar News