బాహుబలి-2 కథ మార్చే ఛాన్స్ ఉందట

Update: 2015-07-17 09:20 GMT
బాహుబలి ముందు ఒక సినిమానే. కానీ తర్వాత నిడివి, మార్కెట్ లెక్కలు అన్నీ చూసుకుని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు జక్కన్న. ఈ మేరకు రెండు భాగాలకూ స్క్రిప్టు సర్దుబాటు చేసేశాడు. ఐతే బాహుబలి పార్ట్-1కి వస్తున్న అద్భుతమైన స్పందన రెండో భాగం విషయంలో రాజమౌళిపై బాధ్యతను పది రెట్లు పెంచింది. అదే సమయంలో తొలి భాగానికి సంబంధించి వచ్చిన విమర్శల్ని కూడా దృష్టిలో ఉంచుకుని రెండో భాగంలో ఎలాంటి లోపాలూ లేకుండా చూసుకోవాలి కూడా. ఈ నేపథ్యంలోనే బాహుబలి.. ది కంక్లూజన్ విషయంలో మార్పులపై రాజమౌళి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవలే సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానెల్లో రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూలో కూడా బాహుబలి రెండో భాగానికి సంబంధించి మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదని రాజమౌళి వెల్లడించాడు. ‘‘బాహుబలి ది బిగినింగ్..కి మొదటి వారం రెస్పాన్స్ అదిరిపోయింది. మా టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంది. అయితే సినిమాకు అసలైన టాక్ ఏంటన్నది నాలుగో వారం పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి జెన్యూన్ రెస్పాన్స్ బట్టి కథలో మార్పులపై నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పాడు జక్కన్న. అంటే ఆగస్టు నెలలో స్క్రిప్టు మీద ఇంకో సిట్టింగ్ వేసి.. ఆ తర్వాతే సెప్టెంబరులో బాహుబలి-2 షూటింగ్ మొదలుపెడతాడన్నమాట రాజమౌళి.
Tags:    

Similar News