బాహుబలి కోసం ఎంత కష్టపడ్డారో

Update: 2016-02-26 09:30 GMT
టాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకోవడం అంటే.. బాహుబలి ముందు వరకూ అసాధ్యం అనే అంతా అనుకున్నారు. కానీ మనసుపెట్టి, ఒక లక్ష్యంతో తీయాలే కానీ.. అదేమీ అందుకోలేనంతటి అసాధ్యమైన విషయం కాదని.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌలి నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బాహుబలి సంచలనాలు సృష్టించడానికి కారణమయ్యాడు జక్కన్న.

ఈ మూవీ కోసం 5వేల వీఎఫ్ ఎక్స్ షాట్స్ తీశారంటే..  ఏ రేంజ్ లో కష్టపడాల్సి వచ్చిందో అర్ధమవుతుంది. బాహుబలి ది బిగినింగ్ లో మనకు కనిపించేదంతా.. దర్శకుడి ఊహే. అసలు సినిమాలో 90 శాతం సీన్స్ గ్రాఫిక్స్ తోనే తీశారంటే ఆశ్యర్యం వేయకమానదు. పట్టుమని పది నిమిషాల పాటు గ్రాఫిక్స్ తో మెప్పించేందుకే టాలీవుడ్ మూవీ మేకర్స్ కి తలప్రాణం తోకకు వచ్చేది. కానీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ తోనే తీసేసి ఔరా అనిపించారు. సినిమాలో ప్రారంభ సన్నివేశంలో కనిపించే జలపాతం దగ్గర నుంచి చివర్లో వచ్చే యుద్ధం సీన్ వరకూ అంతా వీఎఫ్ ఎక్స్ అంటే ఆశ్చర్యం వేయకమానదు.

చేతిలో ఒక బాటిల్ పట్టుకుని దాన్నే తర్వాత పసిపిల్లాడిగా చూపించాలనే థాట్ ని పొగడాల్సిందే. అందుకే తాము పడ్డ కష్టాన్ని, బాహుబలిని ఎలా తీశామో చెప్పడానికి అన్నట్లుగా మధ్యమధ్యలో కొన్ని మేకింగ్ షాట్స్ ను ఇస్తున్నారు బాహుబలి టీం. వీటిని చూస్తుంటే.. మొత్తం బాహుబలి యూనిట్ కి అభినందనలు పలకాల్సిందే.

Tags:    

Similar News