ఆ ఫోన్ కాల్ తో రాజమౌళి టెన్షన్!

Update: 2016-02-22 05:12 GMT
రీసెంట్ గా అర్దరాత్రి రాజమౌళికి ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ఆ ఫోన్ కాల్ రాజమౌళి ఎప్పుడు పడని టెన్షన్ కు గురి చేసిందంట. కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయిందట. అంతేనా ఆ రాత్రంతా నిద్రపోకుండా జాగారం ఉండేలా చేసింది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు..? దేనికి చేశారు..?. అసలు విషయంలోకి వస్తే ఓ రోజు అర్ధరాత్రి నిద్రలో ఉండగా ఓ అపరచితుడు రాజమౌళికి ఫోన్ చేశాడట.

కంగారుగా మాట్లాడుతూ.. ‘సార్‌.. మీరు కేరళలో షూట్ చేసిన ‘బాహుబలి పార్ట్‌-2′ షూటింగ్‌ మొత్తం యూట్యూబ్‌ లో లీకైంది’.. అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. దీంతో కంగారు పడిన రాజమౌళి మొత్తం టీం అందరికి ఫోన్ చేసి రాత్రికి రాత్రే మీటింగ్ పెట్టి లీక్ అయిన లింక్స్ మొత్తం బ్లాక్ చేయడానికి ప్రయత్నించారు. కాని యూట్యూబ్ లో ఎలాంటి లింక్స్ దొరకకపోవడంతో అందరూ కూల్ అయ్యారట. ఎవరో కావాలనే ఫోన్ చేసి వాళ్ళని టెన్షన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News