రమ్య కృష్ణ కి సారీ చెప్పేసిన రాజమౌళి

Update: 2017-04-10 11:54 GMT
‘బాహుబలి’ సినిమాకు శివగామి పాత్ర ఎంత కీలకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. ఆ పాత్రలో ఇప్పుడు రమ్యకృష్ణను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేం. ఇంకెవరైనా ఆ పాత్రలో అంత బాగా నటించి ఉంటారా అన్నది సందేహమే. ఐతే నిజానికి రాజమౌళి ముందు ఈ పాత్రకు రమ్యకృష్ణను అనుకోలేదు. ఆయన ముందు సంప్రదించింది శ్రీదేవిని. మంచు లక్ష్మి కూడా తనను ఆ పాత్రకు అడిగనట్లుగా చెప్పుకుంది. ముందు రమ్యకృష్ణను అడక్కపోవడం పొరబాటే అని రాజమౌళి ఇంతకుముందే చెప్పాడు.

తాజాగా ‘బాహుబలి-2’ తమిళ ఆడియో వేడుక వేదిక మీద నుంచి ఆయన ఈ విషయంలో రమ్యకృష్ణను క్షమాపణ అడిగాడు. ముందు ఆమెను సంప్రదించనందుకు సిగ్గుపడుతున్నానని రాజమౌళి అన్నాడు. ‘‘రమ్యకృష్ణ గారు అందుబాటులో ఉండగాన ఎవరెవరికోసమో ప్రయత్నించా. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా సారీ చెబుతున్నా. వేరే వాళ్ల కోసం ట్రై చేసినందుకు సిగ్గు పడుతున్నా. అంత బాగా ఆమె శివగామి పాత్రను పండించారు’’ అని రాజమౌళి అన్నాడు. రాజమౌళి సారీ చెప్పినపుడు ‘నో’ అన్నట్లుగా సైగ చేసింది రమ్యకృష్ణ. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘పడయప్పా’ (నరసింహా)లో నీలాంబరి పాత్రకు తనకు తిరుగులేని గుర్తింపు వచ్చిందని.. మళ్లీ దాన్ని మించిన పాత్ర వస్తుందని.. అంతకంటే పేరు వస్తుందని తాను ఊహించలేదని.. కానీ శివగామి పాత్ర అంతకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చిందని చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News