సింహాద్రి అంటే 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్
2002 నవంబర్ 13 న ఓ చారిత్రక నిర్ణయం.. తెలుగు సినిమా బాక్సాఫీస్ ని గడగడలాడించే నిర్ణయం అది. జక్కన్న అలియాస్ ఎస్.ఎస్.రాజమౌళి తీసుకున్న ఆ నిర్ణయం తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాస్తుందని ఆరోజు ఎవరూ ఊహించి ఉండరు. యంగ్ యమ ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి చిత్రానికి పునాది పడిన రోజు అది. మొదలు పెట్టాల్సిందే అని అందరూ ఫిక్సయిన రోజు అది.
ఆ సినిమా కోసం రాజమౌళి - కీరవాణి - ఎన్టీఆర్ అండ్ టీమ్ అహర్నిశలు శ్రమించారు. 130 పనిదినాలు.. 8 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ కి ముందే ఎక్కడా లేని క్రేజు వచ్చింది. 13 కోట్లు పైగానే ముందస్తు బిజినెస్ జరిగింది. 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. 2003 జూలై 9 న థియేటర్లలోకి ఘనంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. సింహాద్రి బాక్సులు బద్ధలు కొట్టేశాడు అన్న డిష్కసన్ తప్ప వేరే ఇంకేది వినిపించలేదు. అంత పెద్ద హిట్టయ్యింది.
ఎన్టీఆర్ -రాజమౌళి కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ రికార్డులే అని పక్కాగా ప్రూవైంది. ఎన్టీఆర్ ని - జక్కన్నను నమ్మినందుకు నిర్మాత దొరస్వామిరాజు సూపర్ సక్సెసయ్యారు. పంపిణీదారుడు కం నిర్మాతగా ఆయన పాపులారిటీ కూడా పెరిగింది. అదండీ సింహాద్రి చిత్రీకరణ వెనుక కథ ఇదీ. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ!!