చరణ్- రాజమౌళి.. మళ్లీ అక్కడ కలిశారు

Update: 2016-09-25 04:53 GMT
ఓ హీరో.. ఓ డైరెక్టర్ కేవలం సినిమా కోసమే కాదు.. మనసున్న మంచి మనుషులుగా సాయం చేయడంలోనూ చేతులు కలపచ్చని నిరూపించారు వారిద్దరు. మగధీర చిత్రం కోసం కలిసి వర్క్ చేసిన రామ్ చరణ్.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. ఓ అంధుల పాఠశాలలో పిల్లలు ఎదుర్కుంటున్న పరిస్థితి చూసి చలించిపోయారు.

ప్రస్తుతం వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హైద్రాబాద్ లో అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వార్తలు చూస్తే అర్ధమవుతుంది. దురదృష్టవశాత్తూ డెన్వర్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ పై కూడా ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మోకాలి లోతు నీళ్లు స్కూల్ లో నిలిచిపోవడంతో.. అంధ విద్యార్ధులందరూ ఫస్ట్ ఫ్లోర్ లో బిక్కుబిక్కు మంటూ కాలం గడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితి తెలిసిన రామ్ చరణ్.. ఆ స్కూల్ లోని పిల్లలందరికీ 3 రోజులకు సరిపడే ఆహార పదార్ధాలను అందించగా.. రాజమౌళి తన తరఫున బ్లాంకెట్లు అందేలా చూశాడు.

స్కూల్ పరిస్థితి తెలిసి తమంతట తాముగా కదిలి వచ్చిన రామ్ చరణ్.. రాజమౌళిలకు.. డెన్వర్ మేనేజ్మెంట్ కృతజ్ఞతలు ప్రకటించడంతో.. ఈ విషయం అందరికీ తెలిసింది. సైలెంట్ గానే తమ వంతు సాయం చేస్తున్న ఈ ఇద్దరినీ ఎంతైనా అభినందించాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News