పాకెట్ మ‌నీ కోసం చేసిన ప‌నితో ఇంత‌వ‌ర‌కూ!

డాక్ట‌ర్ కాబోయి సినిమా హీరోయిన్లు అయిన వాళ్లెంతో మంది ఉన్నారు.

Update: 2024-05-04 07:07 GMT

డాక్ట‌ర్ కాబోయి సినిమా హీరోయిన్లు అయిన వాళ్లెంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఏ హీరోయిన్ ని అడిగినా చాలా మంది హీరోయిన్ల నుంచి ఇదే స‌మాధానం వ‌స్తుంది. స‌ర‌దాగా ట్రై చేసి స‌క్సెస్ అయిన వాళ్లు కొంత మందతే? అదే జీవితం తో ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయిన వారు మ‌రికొంత మంది. మ‌రి సీనియ‌ర్ న‌టి త్రిష స‌ర‌దాగా ట్రై చేసిందా? సీరియ‌స్ గా ట్రై చేసి హీరోయిన్ అయిందా? అంటే అమ్మ‌డు రెండో ర‌కం అంటోంది. అవును ఈ బ్యూటీ సినిమాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే లేద‌ట‌.

ఏదో స‌ర‌దాగా పాకెట్ మ‌నీ కోసం ప్ర‌య‌త్నించి పెద్ద హీరోయిన్ అయిపోయింది అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క్రిమిన‌ల్ సైకాల‌జీ చ‌ద‌వ‌డం త్రిష డ్రీమ్ అట‌. స్కూల్లో ఉండ‌గా లాయ‌ర్ అవ్వాల‌ను కుందిట‌. కాలేజీకి వ‌చ్చాక మోడ‌లింగ్ చేయ‌డంతో చిన్న యాడ్ లో న‌టించే అవ‌కాశం రావ‌డం.. ఆత‌ర్వాత జోడీలో హీరోయిన్ సిమ్ర‌న్ ప్రెండ్ పాత్ర అనుకోకుండా రావ‌డంతో స‌ర్లే పాకెట్ మ‌నీకైనా డ‌బ్బులొస్తాయా? స్నేహితురాలిగా న‌టించిందిట‌.

Read more!

తొలుత న‌టించ‌డానికి నాన్న ఒకే చెప్పినా.. మామ్ మాత్రం ఒప్పుకోలేదంది. చివ‌రికి అల‌క పానుపు ఎక్కితే ఒప్పుకు న్నారుట‌. ఎలాంటి క‌ష్టం తెలియ‌కుండా పెరిగిన త‌న‌కి సినిమా అనేది క‌ష్టం చూపిస్తుంద‌ని త‌ల్లి ముందే హెచ్చ‌రించారుట‌. వాటిని త‌ట్టుకునే శ‌క్తి ఉంటే ట్రై చేయ్ లేక‌పోతే కంప‌ర్ట్ జోన్ వ‌దిలి వెళ్లొద్దు అని చెప్పిందిట‌. అలా త్రిష తెరంగేట్రం జ‌రిగింది. అటుపై `వ‌ర్షం`లో ఛాన్స్ అందుకోవ‌డం...అది బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఎంత పెద్ద హీరోయిన్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

తెలుగు..త‌మిళ్ ప‌రిశ్ర‌మ‌ల్ని కొన్నాళ్ల పాటు ఏలింది. ఇప్ప‌టికీ అదే చ‌రిష్మాతో కొన‌సాగుతుంది. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా హీరోయిన్ స్టేట‌స్ ని ఆస్వాదిస్తుంది. గ‌తేడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. ప్ర‌స్తుతం ఐదారు సినిమాల‌తో బిజీగా ఉంది. అవన్నీ సీనియ‌ర్ హీరోల‌కు జోడీగా న‌టిస్తోన్న చిత్రాలే. అందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటుంది. దాదాపు 12 కోట్ల వ‌ర‌కూ ఛార్జ్ చేస్తుం ద‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్లు నేడు త్రిష పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా అందాల న‌టికి హ్యాపీ బ‌ర్త్ డే. ఈరోజుతో 41 లోకి అడుగు పెట్టింది.

Tags:    

Similar News