సలార్ -2 పట్టాలెక్కాలంటే జరగాల్సిందిదే!
ఈ నేపథ్యంలోనే మేకర్స్ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రకారం `సలార్ 2` రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది (2027) జూన్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో `సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం ఒకటి. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన `సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్` చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ప్రాజెక్ట్పై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే ముందుగా ప్రభాస్ చేస్తున్న ఇతర ప్రాజెక్ట్‌ల షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి కావాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా ప్రాజెక్ట్‌లు ఉండటమే `సలార్ 2` ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం `స్పిరిట్`, హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న పీరియాడిక్ వార్ డ్రామా `ఫౌజీ`, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ `కల్కి 2898 AD` సీక్వెల్ షూటింగ్స్‌తో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల షూటింగ్‌లు ఓ కొలిక్కి వస్తేనే ప్రశాంత్ నీల్ తో `సలార్ 2` సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రకారం `సలార్ 2` రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది (2027) జూన్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటం కూడా ఇందుకు మరో కారణం. ప్రభాస్ డేట్స్ సర్దుబాటు కావడం.. అలాగే `స్పిరిట్`, `కల్కి 2`, `ఫౌజీ` చిత్రాల షూటింగ్ దశలు ముగియడం వంటి పరిణామాలు జరిగితేనే ఖాన్సార్ సామ్రాజ్యపు అసలు పోరు తెరపైకి రానుంది.
ప్రశాంత్ నీల్ కూడా సీక్వెల్‌ను మరింత గ్రిప్పింగ్‌గా.. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తీర్చిదిద్దేందుకు స్క్రిప్ట్ వర్క్‌ను మరింత మెరుగుపరుస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం కంటే రెండో భాగంలో శౌర్యాంగల మధ్య జరిగే పోరాటం.. ఎలివేషన్ సీన్స్ పీక్స్‌లో ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు.
ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్.. గ్లోబల్ అప్పీల్ ఉన్న ప్రాజెక్ట్‌లు కావడంతో ప్రతి సినిమాకు ఆయన ప్రత్యేకమైన లుక్ .. మేకోవర్ మార్చాల్సి వస్తోంది. ఈ కారణంగానే డేట్స్ కేటాయింపులో స్వల్ప మార్పులు జరిగి, `సలార్ 2` సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతూ వస్తోంది. అయినా? ఈ సినిమాపై నెలకొన్న హైప్ ఏమాత్రం తగ్గలేదు.
మొత్తంగా సలార్ 2 తెరకెక్కాలంటే ప్రభాస్ సీక్వెల్స్ లో ఓ సినిమానైనా పూర్తిగా ముగించి బయటకు రావాలి.
అప్పుడే డేట్లు ఇవ్వగలడు. అలాగే ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆపనులన్నీ కూడా వచ్చే ఏడాది ఆరంభానికి ఓ కొలిక్కి రానున్నాయి. ఈలోపే ప్రభాస్ రెండు సినిమాల నుంచి షూటింగ్ నుంచైనా రిలీవ్ అవుతారు. అనంతరం సందేహం లేకుండా `సలార్ 2` పట్టాలెక్కుతుంది.