ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ.. మరి హను ఫ్యాన్స్?
సుభాష్ చంద్రబోస్ అంతటివాడు.. అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడి దగ్గర ఫౌజి గురించి ఎలివేషన్ ఇవ్వడం అంటే మాటలు కాదు.
నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజి’ నుంచి ఒక గ్లింప్స్ రిలీజైంది. ఇందులో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర గురించి ఇంట్రో ఇస్తూ వీడియో రిలీజ్ చేసింది టీం. ఇందులో ప్రభాస్ పాత్రకు ఇచ్చిన హైప్, చివర్లో ప్రభాస్‌ను ఊర మాస్ అవతారంలో చూపించడం అభిమానులను ఆకట్టుకుంది. అభిమానులు తమ హీరోకు ఏ రేంజ్ ఎలివేషన్ ఆశిస్తారో అలాంటి ఎలివేషనే దక్కింది ఇందులో.
సుభాష్ చంద్రబోస్ అంతటివాడు.. అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడి దగ్గర ఫౌజి గురించి ఎలివేషన్ ఇవ్వడం అంటే మాటలు కాదు. దీన్ని బట్టే సినిమాలో హీరో క్యారెక్టర్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కథా నేపథ్యం, ప్రభాస్ పాత్ర విషయంలో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. చివర్లో భారీ మెషీన్ గన్ ఆపరేట్ చేస్తూ ప్రభాస్‌ను చూపించడంతో గూస్ బంప్స్ వచ్చాయి. మొత్తంగా ప్రభాస్ అభిమానులైతే టీజర్ చూసి ఫుల్ ఖుషీ అయిపోయారు.
కానీ ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి అభిమానులు మాత్రం ‘ఫౌజి’ టీజర్ చూసి ఒకింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అతను టీజర్లో తన మార్కు చూపించలేదన్నది వారి అభిప్రాయం. ‘సీతారామం’తో అతను సెట్ చేసిన స్టాండర్డ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ అంటే కొంచెం మాస్ టచ్ ఇవ్వాల్సిందే కానీ.. కథను, పాత్రలను ప్రెజెంట్ చేసే తీరులో హను తన క్లాస్ చూపించాలని అభిమానులు కోరుకుంటారు. కానీ నిన్నటి గ్లింప్స్‌లో హిట్లర్, బోస్ మధ్య వచ్చే కాన్వర్జేషన్ చూస్తే సగటు మాస్ సినిమాలో హీరో గురించి విలన్ దగ్గర పక్కనుండే వాళ్లు ఇచ్చే బిల్డప్ తరహాలో కనిపించింది.
బోస్ అంటే ఒక ఐకానిక్ క్యారెక్టర్. అలాంటి వ్యక్తి ఫౌజి గురించి అలా ఊగిపోతూ ఎలివేషన్ ఇవ్వడం అంటూ టూమచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడమే అని.. ఒక స్పై గురించి హిట్లర్ దగ్గర బోస్ అలా చెప్పడం అతిగా అనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హను ఇలా మాస్ మోజులో పడి పాత్రల ఔచిత్యాన్ని దెబ్బ తీసేశాడని.. ఈ సన్నివేశాన్ని తన స్టయిల్లో కొంచెం సెన్సిబుల్‌గా తీయాల్సిందని అంటున్నారు. కథలో బలం ఉంటే ఎలివేషన్ ఆటోమేటిగ్గా పండుతుందని.. ఇలా ఓవర్ ద టాప్ స్టయిల్లో సన్నివేశాలను ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటే బెటర్ అని హనుకు సలహా ఇస్తున్నారు తన ఫ్యాన్స్.