• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్సీవాలా: డైరెక్టర్...

టాక్సీవాలా: డైరెక్టర్ గారి సందడి లేదే?

By - Tupaki Desk
Update: 2018-11-15 12:35 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'టాక్సీవాలా' రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది.  నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.  మాటేవినదుగా.. వినదుగా అంటూ విజయ్ ని పాడుకునేలా చేసిన ప్రియాంక జవాల్కర్ ఫుల్ జోష్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇక మిగతా 'టాక్సీవాలా' టీమ్ మెంబర్స్ కూడా ప్రచార కార్యక్రమాలు జోరుగా చేపడుతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాహుల్ సాంక్రిత్యాన్ మాత్రం ఎక్కడా యాక్టివ్ గా కనబడడం లేదు.  డైరెక్టర్ ది రిజర్వుడుగా ఉండే నేచరో లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ ప్రమోషన్స్ లో అయన సందడి తక్కువగా ఉంది.  'టాక్సీవాలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా అయన తక్కువ సేపే మాట్లాడాడు.  'టాక్సీవాలా' అనగానే విజయ్ దేవరకొండ.. ప్రియాంక జవాల్కర్ మాత్రమే హైలైట్ అవుతున్నారు.

సినిమా మొదలు పెట్టి ఇప్పటికే 2 ఏళ్ళు కావడం.. రిలీజ్ విషయంలో ఆలస్యం.. పైరసీ బారిన పడడం లాంటి వాటితో కాస్త ఇబ్బందిగా ఉన్నాడేమో తెలియడం లేదు.  ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని.. ముందే ఊరికే హంగామా చెయ్యడం ఎందుకని ఆగిపోయాడా.. లేదా టీంతో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఫిలిం నగర్లో వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ రెండురోజుల్లో ఏవైనా ఇంటర్వ్యూల కోసం మీడియా ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.  ఏదేమైనా మనం మాత్రం సినిమా బాగా ఆడాలని కోరుకుందాం.
    

Tags:    
  • Rahul sankrityayan 
  • Taxiwala Movie 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS