జైలు నుండి బయట పడేందుకు హీరోయిన్ డ్రామాలు?
కన్నడ సినిమా పరిశ్రమను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానీ లతో పాటు మరికొందరు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. హీరోయిన్స్ ఇద్దరు కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సార్లు బెయిల్ కోసం వారి తరపు లాయర్ లు పిల్ వేయడం జరిగిందట. కాని అన్ని సార్లు కూడా విచారణ మద్యలో ఉండగా బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ విచారణ అధికారులు కోర్టుకు తెలియజేయడంతో వారికి బెయిల్ నిరాకరించడం జరిగింది. బెయిల్ రాకపోవడంతో రాగిణి బయట పడేందుకు కొత్త డ్రామా మొదలు పెట్టింది అంటూ తమిళ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జైల్లో ఉన్న రాగిణి జారి పడటంతో నడుములో విపరీతమైన నొప్పి అంటూ ఏడుస్తుందట. జైల్లో వైధ్యలు ఆమెను పరీక్షించారట. అయినా నొప్పి తగ్గక పోవడంతో ఆమె బయట ఆసుపత్రికి వెళ్లాలని భావిస్తున్నట్లుగా న్యాయస్థానంలో పిల్ దాఖలు చేసింది. మెరుగైన చికిత్స కోసం తనకు అనుమతి ఇవ్వాలని లేదా బెయిల్ ఇస్తే తాను చికిత్స చేయించుకుంటాను అంటూ ఆమె కోరిందట. ఆమె దాఖలు చేసిన ఈ పిల్ పై విచారణ అధికారులు మరియు ఇతరులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె బయట పడేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతుందేమో అంటున్నారు.
మరికొందరు మాత్రం మానవతాదృక్పదంతో ఆమెకు బెయిల్ ఇవ్వడం మంచిదనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ అనే ఉద్దేశ్యంను పరిగణలోకి తీసుకుని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని లేదంటే కనీసం ఆసుపత్రిలో అయినా జాయిన్ అయ్యందేకు అనుమతి ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు లేదా రేపటి వరకు ఈ విషయంలో కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.