సినీ పరిశ్రమలో హీరోయిన్లు, నటీమణులకు జరుగుతున్న లైంగిక వేధింపులపై పలువురు గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారంతా కలిసి ‘మీటూ’ ఉద్యమం లేవనెత్తారు. ఈ మీటూ ఉద్యమంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ముఖేష్ కన్నా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రతి విషయంలోనూ తాము పురుషులతో సమానమని స్త్రీలు ఆలోచించడం వల్లనే ‘మీటూ’ ఉద్యమం తెరపైకి వచ్చిందని.. ఇంటిని చక్కదిద్దడం మాత్రమే మహిళల పని అంటూ ముఖేష్ ఖన్నా నోరు పారేసుకున్నారు.
బాలీవుడ్ అగ్రహీరో ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటి రాధిక, గాయని చిన్మయి నిప్పులు చెరిగారు. రాధిక మాట్లాడుతూ కొంతమంది మూర్ఖత్వంతో మాట్లాడుతారని.. శక్తిమాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్ కన్నా కూడా అదే కోవకు చెందిన వ్యక్తి అని విమర్శించింది.
ఇక ముఖేష్ ఖన్నాపై గాయని చిన్మయి కూడా మండిపడింది. ‘ఈ మధ్యకాలంలో కొంతమంది మానసిక ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. మహిళలు పనులు, ఉద్యోగాలు చేయడం వల్లే మీటూ ఉద్యమం ప్రారంభమైందన్న ముఖేష్ ఖన్నా.. పురుషులు తమ హింసాత్మక కోరికలను కంట్రోల్ చేసుకోకపోవం వల్లే ఇలాంటివి కొనసాగుతున్నాయని చెప్పలేకపోయారు ’ అంటూ చిన్మయి విమర్శించింది.
ఇలా ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలపై అటు రాధిక, ఇటు గాయని చిన్మయి మండిపడ్డారు. చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ముఖేష్ ఖన్నాపై మండిపడుతున్నారు.