• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  10 వేల థియేటర్స్ లో...

10 వేల థియేటర్స్ లో 'రాధేశ్యామ్'

By - Tupaki Desk
Update: 2022-02-06 05:30 GMT
ఒక తెలుగు హీరో సినిమా 10 వేల థియేటర్స్ లో విడుదలవుతుందని బహుశా ఎవరూ కూడా అనుకుని ఉండరు. చాలా తక్కువ సినిమాలు చేసిన ఒక హీరో ఇంత తక్కువ కాలంలో ఈ రికార్డును టచ్ చేస్తాడని కూడా ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి రికార్డును అందుకున్న హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రమైన 'రాధేశ్యామ్'ను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఒక్క నార్త్ అమెరికాలోనే 2 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. నిజంగా ఇది అంత తేలికైన విషయం కాదు. ప్రపంచపటంపై 'రాధేశ్యామ్' పోస్టర్ పరచుకున్నట్టుగా అనుకోవాలి.

ఇది పాన్ ఇండియా సినిమా .. విదేశాల్లో చిత్రీకరణ .. భారీ గ్రాఫిక్స్ కు పనిచెప్పే కథాకథనాలు. అందువలన టి - సిరీస్ .. యూవీ క్రియేషన్స్ .. గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతరవరకూ వదులుతూ వచ్చిన అప్ డేట్స్ అంతగా అంచనాలు పెంచుతూ వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికుడుగా కనిపించనున్నాడు. తన ప్రేమ - పెళ్లి విషయంతో పాటు భవిష్యత్తులో జరగనున్నది తెలిసిన హీరో, విధిని ఎదిరించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.

ఇంతవరకూ ప్రభాస్ మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ హీరోలా తెరపైకి వస్తున్నాడు. అందుకు తగినట్టుగానే డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఇంతవరకూ ఆమె చేస్తూ వచ్చిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో ఆమె వివిధ భాషల్లోని ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతోంది. సినిమాతో ఆమె మార్కెట్ .. ఆమె పారితోషికం పెరిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక మార్చి 11వ తేదీన విడుదల చేయనుండటంతో, పాన్ ఇండియా స్థాయిలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టవలసి ఉంటుంది. అందుకు తగిన స్థాయిలోనే ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసమే ఒక రేంజ్ లో ఖర్చు చేయనున్నారట. ఆ ఖర్చుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయవచ్చని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు .. సత్యరాజ్ .. సచిన్ ఖేడ్కర్ .. జయరామ్ .. మురళీశర్మ కనిపించనున్నారు. ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి. 
Tags:    
  • radheshyam 
  • prabhas 
  • poojahegdhe 
  • release 
  • march11th 
  • 10thousand 
  • theaters 
  • movienews 
  • tupakiupdates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS