అదిరిపోయేలా ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్​ ఫైట్​.. హాలీవుడ్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణ

Update: 2020-11-13 05:00 GMT
యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ ఎప్పుడెప్పుడు  విడుదలవుతుందా.. అంటూ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్​డేట్స్​ వస్తే ఫుల్​ ఖుషీ అయిపోతున్నారు. పాన్​ఇండియా మూవీగా  తెరకెక్కుతున్న రాధేశ్యామ్​ లో అందాల తార పూజాహెగ్డే హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. యువదర్శకుడు, జిల్ ఫేమ్  రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ  నిర్మాణసంస్థ  యూవీ క్రియేషన్స్ తాజాగా ఓ వార్తను అభిమానుల చెవుల్లో పడేసింది. అదేంటంటే ‘రాధేశ్యామ్​’ క్లైమాక్స్​ సన్నివేశాలు హాలీవుడ్​ సినిమాలను తలపించేలా ఉండ బోతున్నాయనట.  

ప్రఖ్యాత హాలీవుడ్​ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. గతంలో కంగనా నటించిన మణికర్ణిక చిత్రానికి కూడా నిక్​ ఫైట్​లను అద్భుతంగా తీశారు. తాజాగా రాధేశ్యామ్​కు నిక్​ ఫైట్​లను రూపొందిస్తుండటంతో ప్రభాస్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. బాహుబలిలోనూ యాక్షన్ ఘట్టాలు అదిరిపోయిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్​ కోసం హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్​సిటీలో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే రెండు విభిన్నపాత్రల్లో నటించనున్నట్టు టాక్​. ఈ చిత్ర కథపై ఇప్పటికే పలు పుకార్లు ఉన్నాయి. సోషియోఫాంటసీ చిత్రంగా తెరకెక్కనున్నట్టు టాక్​. ప్రభాస్​ కూడా రెండు విభిన్నపాత్రల్లో అలరించనున్నాడట.

ఈచిత్రం పూర్తయ్యాక ప్రభాస్​ మహానటి  ఫేం నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీలో  నటించనున్నారు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్​ తో పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కనున్నది. దీపికా పదుకొనే హీరోయిన్​ గా నటిస్తుంది. దీంతో పాటు  హిందీ దర్శకుడు  ఓం రౌత్​ దర్శకత్వంలో ఆదిపురుష్​ అనే చిత్రంలో కూడా ప్రభాస్​ నటిస్తున్నాడు. ప్రభాస్​ రాముడిగా కనిపిస్తారని  టాక్​.. విలన్​గా బాలీవుడ్​ స్టార్​ సైఫ్ ​అలీఖాన్​ ను ఎంపిక చేశారు. మొత్తం మీద మరో ఐదారేళ్ళ పాటు ప్రభాస్​ వివిధ ప్రాజెక్టుల తో బిజీగా ఉండ బోతున్నారన్నమాట. బాహుబలి తర్వాత ప్రభాస్​ రేంజ్​ పెరిగి పోయింది. సాహో దక్షిణాదిన ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. బాలీవుడ్​లోమాత్రం  భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంతో ప్రభాస్​ బాలీవుడ్​ అభిమానులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్​ ఏ సినిమా తీసినా పాన్​ఇండియా చిత్రాలుగానే తెరకెక్కుతున్నాయి.
Tags:    

Similar News