• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుట్టబొమ్మ కు 'రాధే...

బుట్టబొమ్మ కు 'రాధే శ్యామ్' స్పెషల్ బర్త్ డే విషెస్..!

By - Tupaki Desk
Update: 2021-10-13 07:08 GMT
'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో ఒకరిగా వెలుగొందుతోంది. స్టార్ హీరోల సరసన ఏకైక ఛాయిస్ గా మారిన పుజా.. తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. హైదరాబాద్ టూ ముంబై.. ముంబై టూ చెన్నై అంటూ తిరుగుతూ 'బిజీ హెగ్డే' గా పిలవబడుతోంది. ఈరోజు బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, సహ నటీనటులు, అభిమానులు పూజా కు విషెస్ అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ''రాధే శ్యామ్'' టీమ్ ఆమెకు స్పెషల్ పోస్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ''రాధే శ్యామ్'' చిత్రంలో పుజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణ గా పుజా కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పూజా బ్యూటిఫుల్ గా ఉంది. వైట్ బ్యాగ్రౌండ్ లో వైట్ డ్రెస్ లో నవ్వుతూ నిలబడిన ప్రేరణ.. ఓ ఏంజెల్ లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ వింటేజ్‌ ప్రేమకథలో ప్రేరణ పాత్ర గుర్తుండి పోతుందని అంటున్నారు.

'రాధే శ్యామ్' చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గీతాకృష్ణ సంస్థలు కలసి భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాని రూపొందిస్తున్నాయి. వంశీ - ప్రమోద్ - భూషణ్ కుమార్ - ప్రశీద దీనికి నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ మరియు మిథున్ - మనన్ భరద్వాజ్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే పూజా హెగ్డే 'రాధే శ్యామ్' తో పాటుగా తెలుగులో మరో మూడు - తమిళ్ లో ఒకటి - హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. అఖిల్ అక్కినేనికి జోడీగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. రామ్ చరణ్ కు జంటగా నటించిన 'ఆచార్య' సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతోంది. అలానే మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ లో కూడా పూజాహెగ్డే ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రంలోనూ పూజా నే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

హిందీలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న 'సర్కస్' సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటుగా సల్మాన్ ఖాన్ - అక్షయ్ కుమార్ లతో ఒక్కో సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇక తమిళంలో స్టార్ హీరో విజయ్ తో కలిసి పూజా హెగ్డే 'బీస్ట్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఇది ఆమెకు రెండో తమిళ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లో జరుగుతోంది. పూజా తన 32వ బర్త్ డే ని ఈసారి బీస్ట్ షూట్ లో జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది.


Tags:    
  • Radhe Shyam 
  • Special Birthday Wishes 
  • Pooja Hegde 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS