సమ్మర్ పోటీ నేపథ్యంలో 'రాధేశ్యామ్' కొత్త వ్యూహం
ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో సినిమా ఉత్తరాదిన మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా అక్కడ భారీ అంచనాలను కలిగి ఉంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొన్న దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది. షూటింగ్ గత నెలలో ప్రారంభం అయ్యింది.
రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన పార్ట్ ను పూర్తి చేసుకుని వచ్చేసింది. త్వరలో ప్రభాస్ ఇతర యూనిట్ సభ్యులు కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు. వెంటనే హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ఉండబోతుంది. డిసెంబర్ వరకు రాధేశ్యామ్ పూర్తి చేయబోతున్నారు. ఇక సినిమాను మొన్నటి వరకు సమ్మర్ లో విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.
సమ్మర్ లో చిన్న పెద్ద సినిమాలు కలిపి పది నుండి పదిహేను వరకు విడుదలకు సిద్దం అవుతున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ లో కూడా సమ్మర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ఆ కారణం వల్ల జనవరిలోనే సినిమాను విడుదల చేస్తే అక్కడ ఇక్కడ పోటీ తక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జనవరి నుండి థియేటర్లు పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా నడిస్తే ఖచ్చితంగా విడుదల చేసేందుకు గాను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి మొదటి వారం వరకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఈ సినిమా స్టైలిష్ గా రాధాకృష్ణ రూపొందిస్తున్నాడు.