• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : ఆ చూపులకు...

ఫొటోటాక్ : ఆ చూపులకు ఎంతటి వారైనా విలవిల

By - Tupaki Desk
Update: 2021-12-04 13:30 GMT
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. మొదటి సినిమా సమయంలో ఈ అమ్మడిని ముద్దుగుమ్మ అనడం కంటే బొద్దు గుమ్మ అనడం కరెక్ట్‌. ఆ సమయంలో కాస్త ఎక్కువ లావు ఉండేది. రెండు మూడు సినిమాల వరకు రాశిఖన్నా కాస్త ఎక్కువ బరువుతోనే కనిపించింది.

ఆ తర్వాత టాలీవుడ్‌ లో ఇమడాలంటే.. ఇక్కడ సక్సెస్ లు దక్కించుకోవాలంటే స్టార్స్ కళ్లలో పడాలంటే సన్నబడాలని తెలుసుకుంది. అందుకోసం కాస్త ఎక్కువ కష్టపడింది... సన్నబడింది. ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంది.

పెద్ద హీరోల సినిమాల్లో ఒకటి రెండు ఛాన్స్ లు వచ్చాయి. కాని స్టార్ హీరోయిన్‌ గా మాత్రం మారలేక పోయింది. యంగ్‌ హీరోలతో సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ ను నెట్టుకు వెళ్తున్న ఈ అమ్మడు మద్యలో కాస్త గ్యాప్ వచ్చినా మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు మరియు తమిళం కలిపి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి.

ఆ ఆరు సినిమాలు కూడా మంచి అంచనాల నడుమ రూపొందుతున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మడు తెలుగు లో నటిస్తున్న పక్కా కమర్షియల్‌ మరియు చైతూతో కలిసి నటించిన థ్యాంక్యూ సినిమాలు చాలా అంచనాలు కలిగి ఉన్నాయి. ఆ సినిమాలు సక్సెస్‌ దక్కించుకుంటాయని అంటున్నారు. సినిమాలతోనే కాకుండా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ తో కూడా ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా ఈ ఫొటో షూట్‌ తో అదరగొట్టింది. ఈ ఫొటోలో ఆమె చూపుకు ఎంతటి వారైనా విల విలలాడిపోవాల్సిందే కదా అన్నట్లుగా కొంటె చూపులు చూస్తోంది. ఆ ఔట్‌ ఫిట్‌ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ కు యువరాణి తరహాలో ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా ఈ అమ్మడి సొంతం.

అందుకే ఇక ముందు ఈ అమ్మడికి ఖచ్చితంగా మంచి ఆఫర్లు పెద్ద సినిమాల్లో స్టార్‌ హీరోలకు జోడీగా అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక్క బడా హీరోతో కమర్షియల్‌ హిట్ పడితే ఈ అమ్మడు అయిదేళ్లు వెనక్కు తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుందని అంటున్నారు.


Tags:    
  • Raashii Khanna 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS