• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈమె మెల్లగా తమిళంకు...

ఈమె మెల్లగా తమిళంకు షిఫ్ట్‌ అవుతుందా?

By - Tupaki Desk
Update: 2020-05-04 04:58 GMT
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే పాజిటివ్‌ రెస్పాన్స్‌ ను దక్కించుకున్న రాశిఖన్నా నటన పరంగా మంచి మార్కులు పొందింది. అయితే కాస్త లావు ఉందంటూ విమర్శలు రావడంతో కష్టపడి బరువు తగ్గింది. తెలుగులో యంగ్‌ హీరోలతో రెండేళ్ల పాటు వరుసగా నటించింది. కొన్ని హిట్స్‌ కొన్ని ప్లాప్స్‌ వచ్చినా కూడా కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది. స్టార్‌ హీరోల పిలుపు కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన రాశికి ఆ పిలుపే దక్కలేదు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎవరు కూడా ఈమెను పట్టించుకోవడం లేదు. టైర్‌ 2 హీరోలు మాత్రమే ఈమెను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈమెకు తమిళం నుండి బంపర్‌ ఆఫర్‌ దక్కింది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌ గా ఎంపిక అయ్యిందట. ఇప్పటి వరకు ఆ విషయం అధికారికంగా వెళ్లడి కాలేదు. కాని తాజాగా రాశి ఖన్నా ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది.

తమిళంలో సూర్యతో నటిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో లైవ్‌ లో మాట్లాడుతూ చెప్పింది. తెలుగులో ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదని.. త్వరలో కొత్త ప్రాజెక్ట్‌ లకు ఓకే చెప్తానంది. ప్రస్తుతం ఈ అమ్మడి దృష్టి తెలుగు కంటే తమిళంపైనే ఎక్కువగా ఉందని.. సూర్యతో చిత్రం తర్వాత తమిళంలో బిజీ అవుతానని.. అక్కడ స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఆశిస్తుందట.

తెలుగులో చేసిన ప్రయత్నాలకు స్వస్థి చెప్పి ఇకపై తమిళంలోనే కొనసాగాలని ఈమె అనుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలుగులో పెద్ద హీరోలతో ఛాన్స్‌ లు వస్తేనే కాని చేయాలని ఈమె ఎదురు చూస్తుందట. చిన్న హీరోలతో ఆఫర్లు వస్తున్నా కూడా వాటిని కాదంటుందట. తమిళనాట కాస్త ఆఫర్లు వరుసగా వస్తే ఖచ్చితంగా ఈ అమ్మడు పూర్తిగా అక్కడికే షిఫ్ట్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Raashi Khanna to play the Lead role in Surya next movie 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS