జీన్స్ లో జామపండులా ఊరిస్తున్న మెగాస్టార్ రత్తాలు!!

Update: 2021-02-12 10:53 GMT
సౌత్ హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమధ్య సినిమాల విషయంలో బాగా స్లో అయిపోయింది. తాజాగా అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ట్రీట్ ఇచ్చింది. సినిమాలలో తక్కువ కనిపించినా లక్ష్మీరాయ్ కి సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే అప్పుడప్పుడు అభిమానుల కోసమైనా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా లక్ష్మి డెనిమ్‌ జీన్స్ ధరించిన గ్లామరస్ ప్రోలాగా కనిపిస్తుంది. ఈ వయ్యారి క్లాసిక్ కర్లీ హెయిర్ గాల్లో ఎగరేస్తూ స్టైలిష్ పోజుతో చూపరులను ఆకర్షిస్తోంది. నిజానికి రాయ్ మేకప్ హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే మేకప్ ఉన్నాకూడా అమ్మడు రూపం నేచురల్ గా ఆకట్టుకుంటోంది. ఇక కళ్లతోనే మాయ చేయగల సత్తా తనలో ఉందని ప్రూవ్ చేస్తోంది లక్ష్మిరాయ్.

ఆకర్షనీయమైన పోజులతో డెనిమ్ జాకెట్ అండ్ జీన్స్ లో హైక్లాస్ కనిపిస్తుంది అమ్మడు. అయితే లక్ష్మి కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికి తెలియదు. లక్ష్మి సినిమాలతో పాటు శారీరక సౌష్టవానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఎప్పుడు చూసినా తాజాగా ఊరిన మామిడి పండులా ఊరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కంప్లిమెంట్స్ అందుకుంటుంది. అందం అభినయంతో ఆకట్టుకునే రాయ్.. లేటెస్ట్ వన్నెలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లక్ష్మి.. మరి సినిమాలు ఎందుకు తగ్గించిందో అర్ధం కావడం లేదంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. అయితే అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉండగా.. ఫ్యాషన్, ఫిట్‌నెస్ లక్ష్యాలతో తన అభిమానులకు వినోదం అందిస్తుంది.


Tags:    

Similar News