వర్మ సినిమా వివాదంపై ఎర్రన్న ఏమన్నాడంటే..!

Update: 2019-03-21 10:40 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రానికి సెన్సార్‌ బోర్డు సభ్యులు సెన్సార్‌ చేయకుండా అడ్డంకులు చెబుతున్న విషయం తెల్సిందే. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల చేసుకోవాలని, అప్పటి వరకు సెన్సార్‌ చేయమని వర్మకు సెన్సార్‌ బోర్డు వారు చెప్పారట. దాంతో వర్మ రేపు విడుదలవ్వాల్సిన సినిమాను వాయిదా వేసిన విషయం తెల్సిందే. తాజాగా వర్మ సినిమాకు వచ్చిన సెన్సార్‌ సమస్య పట్ల విప్లవ చిత్రాల దర్శక రచయిత ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ వర్మకు మద్దతుగా నిలిచాడు.

ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో పసుపులేటి రామారావు రచించిన శ్రీదేవి కథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ... తాను రూపొందించిన ఒక సినిమా సెన్సార్‌ కు సమస్య తలెత్తినప్పుడు నేను ముంబయి వెళ్లాను. అప్పుడు ఆమె నాకు సాయం చేశారు. ఆమె పీఏతో చెప్పి నాకు అక్కడ అవసరం అయిన అన్ని వసతులు ఏర్పాటు చేయించారు. నాతో మాట్లాడుతూ మీరు మంచి విప్లవ సినిమాలు తీస్తారు, మీ సినిమాలో నటించాలని ఉంది అంటూ చెప్పారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరు ముంబయి వెళ్లినా కూడా ఆమె అలాగే రిసీవ్‌ చేసుకునేవారట. అలాంటి మహా వ్యక్తి ఇప్పుడు ఉంటే సెన్సార్‌ బోర్డు వ్యవహరిస్తున్న తీరు చూసి చాలా బాధపడేవారేమో.

రాజకీయాల మీద సినిమా తీస్తే సెన్సార్‌ చేయరా, ఇదెక్కడి ప్రజాస్వామ్యం. ఎవరో సినిమా గురించి ఎలిగేషన్‌ పెట్టగానే సెన్సార్‌ కు నో చెప్పడమేనా అంటూ మండి పడ్డాడు. సినిమాల సెన్సార్‌ విషయంలో పెడుతున్న నిబందనలు మరియు నియమాల విషయంలో ఇండస్ట్రీ మొత్తం మాట్లాడాలి. సెన్సార్‌ బోర్డు విషయంలో ఎవరు స్పందించ వద్దు. నిర్మాతలను ఇబ్బంది పెట్టేలా సెన్సార్‌ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై ఎర్రన్న తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేయడం జరిగింది. 
Tags:    

Similar News