అన్ని మెట్రోల్లోనూ రెచ్చిపోనున్న పుష్ప‌

Update: 2021-12-06 08:30 GMT
పుష్పరాజ్ బాక్సాఫీస్ వ‌సూళ్ల‌కు మాస్ తో పాటు క్లాస్ థియేట‌ర్లు పెద్ద సాయం కావాల‌న్న‌దే హోప్. అందుకే దేశంలోని అన్ని మెట్రో న‌గ‌రాల్లో పుష్ప ప్ర‌మోషన్స్ ని అద‌ర‌గొట్టేయాల‌న్న ప్లాన్ తో దూసుకెళుతోంది టీమ్.

హైద‌రాబాద్- కొచ్చి- చెన్నైల్లో పుష్ప రాజ్ ప్ర‌మోష‌న్స్ ఒక రేంజులో సాగ‌నున్నాయ‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ 12న గ్రాండ్ గా ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ వేదిక‌పై ప్ర‌భాస్ ఛీప్ గెస్ట్.. కేటిఆర్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

పుష్ప‌ రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగం డిసెంబర్ 17న విడుదల కానుంది. భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హైద‌రాబాద్ యూసఫ్ గుడ్ పోలీస్ గ్రౌండ్స్ వేదికను టీమ్ సిద్ధం చేస్తోంది.

నిజానికి దుబాయ్ లో జ‌ర‌గాల్సిన ఈ ఈవెంట్ అనూహ్యంగా ఇటు షిఫ్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఒమిక్రాన్ రంగ ప్ర‌వేశం చేయ‌డంతోనే ఈ మార్పు అని తెలిసింది. మ‌రోవైపు హిందీ ప్ర‌మోష‌న్స్ కోసం బ‌న్ని ముంబైలో పాగా వేస్తాడ‌ని కూడా తెలిసింది. ఈ బుధ‌వారం ట్రైలర్ విడుదల కాబోతుంది. మరో రెండు రోజుల్లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ కూడా పూర్తి కానుంది.


Tags:    

Similar News