#పుష్ప‌.. బుల్లెట్టు బాబు బండి నంబ‌ర్ సూప‌రూ..!

Update: 2021-11-06 06:30 GMT
నా బండి నంబ‌ర్ 666 నేనేమో AA అంటున్న ఆ పూల‌చొక్కాయ్ బాబు ఎవ‌రో కానీ గ‌మ్మ‌త్తుగున్న‌డు! కొండ కోన‌ల్లో గిరిజ‌న జ‌నాల్లో తిరిగేటోడు అలా ఘాట్ రోడ్లు ఎక్క‌డానికి బుల్లెట్టు పై షికార్ వెళ‌తాడ‌న్న‌మాట‌. ఇంత‌కీ ఆయ‌న పేరేమిటి? అంటే పుష్ప అలియాస్ పుష్ప‌రాజ్. పేరుకు త‌గ్గ‌ట్టే నాటుగా ఘాటుగా మాసీగా ఉంటాడు. జుల‌పాల జుత్తు గుబురు గ‌డ్డం బొద్దుగా ఉండే మీసం బ‌లిష్ఠ‌మైన శ‌రీరం.. ముఖంపై క‌త్తిగాట్లు .. ఒంగి పోయిన గూని .. అబ్బో ఇలా చెప్పుకుంటూ వెళితే పుష్ప‌రాజ్ లో స్పెషాలిటీస్ ఎన్నో ఎన్నెన్నో!!

అదంతా స‌రే కానీ పుష్ప రాజ్ బ్యాక్ ఫీటున అలా బుల్లెట్టు బండిపై కూచుని ఏం చేస్తున్నా కానీ జ‌నాల చూపు మాత్రం ఆ బండి నంబ‌ర్ పైనే ఉంది. ఆ పూల చొక్కాయ్ కి కాంబినేష‌న్ ఫార్మ‌ల్ ఫ్యాంటు కూడా అదిరెనండీ..!

అసలింత‌కీ 666 వెన‌కా AAI వెన‌కా AAI 666 వెన‌కా దాగి ఉన్న అస‌లు ర‌హ‌స్య‌మేమిటీ? అన్న‌ది శోధిస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి. AA అంటే అల్లు అర్జున్. AAI అంటే అల్లు అర్జున్ - ఐకాన్ స్టార్ అని అర్థం. మ‌రోవైపు 666 నంబ‌ర్ వెన‌క లాజిక్ ఏదీ? అంటే.. అది బ‌న్ని ల‌క్కీ నంబ‌ర్ అని తెలిసింది. ఇటీవ‌లి కాలంలో అల్లు అర్జున్ నిర్మిస్తున్న మ‌ల్టీప్లెక్స్ చెయిన్ కి కూడా AA బ్రండ్ ని ఉప‌యోగించారు. ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి నిర్మిస్తున్నారు కాబ‌ట్టి AAA సినిమాస్ అంటూ టైటిల్ ని అద‌ర‌గొట్టారు. ఇక అల్లు అర్జున్ కోసం కొలువుదీరిన ఫాల్క‌న్ పైనా AA బ్రాండ్ లోగో క‌నిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్రాండ్ పేరు AAని ప్రతిచోటా ప్ర‌చారం చేసుకోవ‌డంలో చాలా ముందున్నారు. ఎంతో క్లారిటీతో ఈ లోగోని బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తున్నారు.

బ‌న్నీకి సంబంధించిన ప్ర‌తి వేడుక‌లో కూడా ఇది ప్రతిచోటా కనిపిస్తుంది. అతని వ్యక్తిగత రేంజ్ రోవర్ లగ్జరీ కారు కూడా వీల్ బేరింగ్ లపై AA అని చదివే టోపీని కలిగి ఉంటుంది. ఏఏకి ఆ రేంజులో ప్ర‌మోష‌న్ ఉంది.

ఇప్పుడు పుష్పలో ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కి AAI 666 నంబర్ ని ఎంపిక చేయ‌డం వెన‌క లోగో బ్రాండ్ ని బిల్డ్ చేయ‌డ‌మే కార‌ణం. దానికి తోడు సినిమా రిలీజ‌య్యాక‌ ఈ బైక్ ను వేలం వేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ నంబర్ కానప్పటికీ ఈ నంబర్ కు లాజిక‌ల్ గా ఉప‌యోగిస్తున్నార‌ని అర్థ‌మవుతోంది. పుష్ప సినిమా ఆద్యంతం బ‌న్నీ వెళుతున్న‌ప్పుడ‌ల్లా ఇన్ ఫిలింబ్రాండింగ్ లా AA అంద‌రి మైండ్ లో ప్రింట్ అవుతుంద‌న్న‌మాట‌. దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో పుష్ప‌కి సంబంధించిన‌ ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అక్క‌డ బ‌న్ని ఇలా బుల్లెట్టు పై రైడ్ చేస్తుంటే ఛాయాగ్రాహ‌కుడు లెన్స్ వేసి షూట్ చేస్తున్నార‌న్న‌మాట‌. పుష్ప చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా అనసూయ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. అలాగే మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా న‌టిస్తున్నారు.


Tags:    

Similar News