కోలీవుడ్ లోను బాక్సాఫీస్ బద్ధకం వదిలించేస్తున్నాడే!
'పుష్ప' సినిమా విడుదలైన రోజున వచ్చిన టాక్ చూస్తే, ఈ సినిమా అంతగా ఆడకపోవచ్చని అంతా అనుకున్నారు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమైన పాత్రలుగా అనిపించిన సునీల్ .. అనసూయ .. రష్మిక పాత్రల నుంచి ఆశించిన స్థాయి అవుట్ పుట్ లేదని చెప్పుకున్నారు. అలాంటి సమయంలోనే బన్నీ ప్లాన్ చేసిన సక్సెస్ పార్టీలు ఈ సినిమాపై టాక్ మారడానికి కారణమయ్యాయి. ఇక చాలా కాలంగా థియేటర్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన వాళ్లంతా ఈ సినిమా థియేటర్స్ బాట పట్టడం కూడా మరో కారణంగా నిలిచింది.
తొలి రోజు టాక్ ను తొలి రోజే వదిలేసి ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాగే ఓవర్సీస్ లోను ఈ సినిమా తనదైన దూకుడు చూపించింది. ఇక హిందీలోను పుష్ప 'తగ్గేదే లే' అనిపించాడు. బన్నీ సినిమాలు హిందీలోకి డబ్ అవుతూ ఉండటం వలన అక్కడి ఆడియన్స్ కి ఆయన యాక్షన్ ఎలా ఉంటుందనేది తెలుసు. ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. అందువల్లనే నామ మాత్రంగా అక్కడ ప్రమోషన్స్ చేసినప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది.
హిందీలో ఈ సినిమా 15 రోజుల్లోనే 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టేసి, 75 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తుండటం విశేషం. తమిళంలో నాన్ 'బాహుబలి' సినిమాలలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతంలో 'ఈగ' సినిమా అక్కడ 24.5 గ్రాస్ ను వసూలు చేయగా. ఆ రికార్డును 'పుష్ప' అధిగమించాడు. అక్కడ ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసింది. ఇక మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లనే మనవాడిని మల్లూ అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అక్కడ కూడా ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
'పుష్ప' రిలీజ్ డేట్ ముందుగా ఇచ్చేసి సుకుమార్ ను కాస్త కంగారు పెట్టడం వలన, ఆశించిన స్థాయి అవుట్ పుట్ ను ఆయన ఇవ్వలేకపోయాడని అంతా చెప్పుకున్నారు. ఆ అసంతృప్తి సుకుమార్ లో ఉందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, 'పుష్ప' సరైన సమయంలోనే వచ్చింది అనిపిస్తోంది. లేదంటే ఇప్పుడు వాయిదా పడుతున్న సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఉండేదేమో. సరైన సమయంలో రంగంలోకి దిగడం వల్లనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకి పైగా వసూలు చేయగలిగిందనే విషయం అర్థమైపోవడం లేదూ!