ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ఏంటి షాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా కొత్త ఏడాది ఏప్రిల్ కూడా వచ్చేసింది. మరి ఈ సినిమా షూటింగ్ ఎంత వరకూ పూర్తయింది? అంటే విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. ఇంకా పూర్తి చేయాల్సిన భాగం 60 శాతంగా ఉందని అంటున్నారు.
కొన్ని మేజర్ షెడ్యూల్స్ తప్పితే పూర్తి చేయాల్సిన కీలక షెడ్యూల్స్ ఉన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ముగింపు దరశకు వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఏడాది కాలంగా సెట్స్ లో ఉండటంతో? ఆరకమైన అంచనా తప్పు లేనిదే. కానీ తాజాగా వస్తోన్న అప్డేట్ చూస్తేనే షాక్ అవ్వాల్సి వస్తోంది. మరి ఇందులో నిజమెంతో అధికారికంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే భారీ సెట్లు, వేలమంది జనం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ఉంటాయి. కానీ ఇంతటి వేగవంతమైన కాలంలో కూడా షూటింగ్ నత్తనడకన సాగుతుం డటంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
ఈ లెక్కన సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరి షూట్ ఆలస్యానికి కారణం ఏంటి అంటే? ప్రశాంత్ నీల్ కారణంగానే డిలే అవుతుందని తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చెక్కే క్రమంలోనే ఆలస్యం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం వందల రోజులు వెచ్చించడం నీల్ స్టైల్. పైగా ఎన్టీఆర్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. దీని కోసం తారక్ ఫిజిక్ మేకోవర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్వాలిటీ కోసం సమయం తీసుకున్నా పర్లేదు కానీ మరీ ఇంత ఆలస్యం కావడం ఏంటని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. ఇదే నిజమైతే సినిమా 2026 రిలీజ్ అవ్వడం అసాధ్యమే. వాస్తవానికి 2026 ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2027లోనే రిలీజ్ అవుతుం దని చెప్పొచ్చు. ఇప్పటికే తారక్ కోసం చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు. `డ్రాగన్` నుంచి పూర్తిచేసుకుని ఎప్పుడు బయటకు వస్తాడా? ముఖ్యంగా కొరటాల శివ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. `దేవర`కు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మరో సినిమా చేయకుండా `దేవర 2` తో వచ్చిన విమర్శల్ని చెరుపుకోవాలని ఎంతో తహ తహటలాడుతున్నాడు. కానీ తాజా పరిస్థితులు చూస్తే `దేవర 2` అంతకంతకు ఆలస్యమయ్యేలా ఉంది.