హీరోయిన్ కు సద్గురు విలువైన సలహా! కుమార్తె పెంపకంలో మామ్ అందోళన
ఈ నేపథ్యంలో తాజాగా అలియాభట్ ఆధ్యాత్మిక గురువు సద్గురును ఆమె సలహా కోరారు. దానికి సంబంధించి ఓ ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.;
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిగా ఎంత బిజీగా ఉన్నా? కుటుంబానికి కావాల్సిన సమయాన్ని కేటాయించి వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. ముఖ్యంగా మామ్ అయిన తర్వాత సినిమాల కంటే కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. అవసరమైతే షూటింగ్ లు వదలుకుంటుంది తప్ప! ఫ్యామిలీని మాత్రం మిస్ అవ్వడం లేదు. అయినా ఓ తల్లిగా కుమార్తె రాహా కపూర్ పెంపకం విషయంలో అలియాభట్
ఏవైనా తప్పులు చేస్తానో? ఏమో? అన్న భయం, ఆందోళన అమ్మడిని ఆవహించాయి. నిరంతరం వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా అలియాభట్ ఆధ్యాత్మిక గురువు సద్గురును ఆమె సలహా కోరారు. దానికి సంబంధించి ఓ ఆసక్తికర సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. సద్గురుతో జరిగిన ఈ చర్చలో ఆలియా తన మనసులోని భయాన్ని ఇలా బయటపెట్టారు. `రాహాకు ఒక మంచి తల్లిగా ఉండాలని నేను ఎప్పుడూ తాపత్రయపడుతుంటాను. కానీ నా నిర్ణయాలు ఆమె భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అని భయంగా ఉంటుంది. ఒక ఉత్తమమైన తల్లిగా ఉండటానికి నేను ఏం చేయాలి? అని అడిగారు. దానికి సద్గురు తనదైన శైలిలో చాలా సరళమైన సమాధానం ఇచ్చారు.
సద్గురు మాట్లాడుతూ పిల్లల పెంపకం గురించి అతిగా ఆందోళన చెందవద్దని ఆలియాకు సూచించారు. `నువ్వు ఒక మంచి తల్లిగా ఉండటానికి ప్రయత్నించకు. కేవలం ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఉండు. నువ్వు ఆనందంగా ఉంటే? నీ బిడ్డ కూడా నిన్ను చూసి అదే నేర్చుకుంటుంది. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను, ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తార`ని వివరించారు. ఈ సమాధానం ఆలియాభట్ కు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. పిల్లలకు నేర్పించడం కంటే? వారి నుంచి నేర్చుకోవడం గొప్ప విషయమని సద్గురు సూచించారు.
పిల్లలు సహజంగానే స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటారని వారి ఆ నిష్కల్మషమైన నవ్వును మనం చెడగొట్టకుండా ఉంటే చాలన్నారు. తల్లిదండ్రులు తమ అంచనాలను, భయాలను పిల్లలపై రుద్దకూడదన్నారు. వారిని వారి స్వభావం ప్రకారం ఎదగనివ్వాలని హితవు పలికారు. ఇది విని ఆలియా తన పెంపకం పట్ల ఉన్న ఒత్తిడిని తగ్గించుకున్నట్లు కనిపించింది. ఆలియా భట్ - సద్గురు మధ్య జరిగిన ఈ సంభాషణ నేటి తరం తల్లిదండ్రులకు ఒక గొప్ప పాఠంగా నిలుస్తోంది. పిల్లల కోసం నిరంతరం కంగారు పడటం కంటే? ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన, సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించడమే అసలైన పెంపకం అని సద్గురు మాటల్లో స్పష్టంగా అర్దమవుతుంది. రాహా కపూర్‌ను ఒక స్వేచ్ఛాయు తమైన వాతావరణంలో పెంచడానికి ఈ సలహా తనకు ఎంతో ఉపయోగ పడుతుందని ఆలియా భట్ భావిస్తున్నారు.