చరణ్ 'పెద్ది'.. ఆ డిస్కషన్ పూర్తిగా వేస్టేమో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దికి సంబంధించిన పహిల్వాన్ గ్లింప్స్ ఓ వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోవైపు పలు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దికి సంబంధించిన పహిల్వాన్ గ్లింప్స్ ఓ వైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరోవైపు పలు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆ గ్లింప్స్ లో కనిపించిన చరణ్ బాడీ, సిక్స్ ప్యాక్ పై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీఎఫ్‌ఎక్స్ సహాయంతోనే ఆ లుక్ ను సృష్టించారనే ప్రచారం జరుగుతోంది.
సినీ ఇండస్ట్రీలో వీఎఫ్‌ఎక్స్ వినియోగం కొత్త విషయం కాదు. కొన్నిసార్లు హీరోల లుక్స్ ను మరింత అట్రాక్టివ్ గా చూపించేందుకు టెక్నాలజీ సహాయం తీసుకుంటారు మేకర్స్. అయితే ఆ సందర్భాల్లో ప్రేక్షకులు కూడా క్లియర్ గా గుర్తించగలుగుతారు. గతంలో విడుదలైన కొన్ని పెద్ద సినిమాల్లో బాడీ డబుల్స్ కు హీరోల తలలను యాడ్ చేసినట్లు కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
అటువంటి విజువల్స్ నేచురల్ గా అనిపించకపోవడం వల్ల అవి ఈజీగా బయటపడతాయి. కానీ పెద్ది చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ లో మాత్రం అలాంటి లక్షణాలు అసలు కనిపించడం లేదు. రామ్ చరణ్ బాడీ మేకోవర్ కంప్లీట్ నేచురల్ గా కనిపిస్తోంది. ఆయన కండరాలు, బాడీ షేప్, మూవ్మెంట్స్ చూస్తుంటే.. నిజంగా కష్టపడి సాధించిన ఫిట్నెస్ అని స్పష్టంగా అర్థమవుతోంది.
రామ్ చరణ్ గతంలో కూడా తన పాత్రల కోసం బాడీ పరంగా ఎంతో కష్టపడ్డ విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో కొత్త లుక్ కోసం శిక్షణ తీసుకోవడం ఆయన అలవాటు. ఇప్పుడు పెద్ది చిత్రంలో పహిల్వాన్ పాత్ర కోసం కూడా ఆయన కఠినమైన వ్యాయామాలు, డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చిన ఫలితమే పవర్ ఫుల్ లుక్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న వీఎఫ్‌ఎక్స్ వ్యాఖ్యలు ప్రూవ్ లెస్ గా కనిపిస్తున్నాయి. గ్లింప్స్ ను క్లియర్ గా పరిశీలిస్తే, ప్రతి ఫ్రేమ్ లోనూ చరణ్ ఫిజిక్ నేచురల్ గా ఉండటం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి సందర్భాల్లో అనవసర చర్చలకు పెద్దగా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు అభిమానులు చెబుతున్నారు. అదంతా టైమ్ వేస్ట్ వ్యవహారమని కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనా పెద్ది చిత్రంలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ పూర్తిగా ఆయన కష్టానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతోంది. వీఎఫ్‌ఎక్స్ పై జరుగుతున్న చర్చలు టైమ్ వేస్ట్ చేసే విషయాలుగా మారుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి విషయాల కంటే, సినిమాలోని కంటెంట్, యాక్టింగ్, కథపై దృష్టి సారించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్ తో అంచనాలు మరింత పెరిగాయి. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.