83కి పోటీగా! `పుష్ప` హిందీ వెర్షన్ 50కోట్ల క్లబ్ లోకి..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన రేంజును అంతకంతకు పెంచుకోవడంలో సఫలమవుతున్నారు. ఇప్పటికే తెలుగు-మలయాళంలో అగ్ర హీరోగా హోదాను ఆస్వాధిస్తున్న అతడికి హిందీ మార్కెట్లోనూ భారీ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అక్కడ బాక్సాఫీస్ వద్ద పుష్ప - ది రైజ్ సాధిస్తున్న వసూళ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి.
త్వరలోనే పుష్ప 50కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. బాలీవుడ్ లో అప్పటికే రిలీజైన రణవీర్ సింగ్ 83 కి ధీటుగా పుష్ప వసూళ్లు సాధిస్తోందని హిందీ ట్రేడ్ వెల్లడించింది.
ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ హిందీ జోరు కొనసాగింది. ఈ చిత్రానికి క్రిస్మస్ సెలవులు బాగా కలిసొచ్చాయి. కలెక్షన్ల ప్రభంజనం సాధ్యమైందని బాలీవుడ్ ట్రేడ్ చెబుతోంది. ఆరంభం కొంత తగ్గినట్టు అనిపించినా ఇంతలోనే క్రిస్మస్ వేళ వసూళ్లలో మంచి జంప్ ను నమోదు చేసింది. పుష్ప హిందీ వెర్షన్ వారాంతానికి 10 కోట్ల నెట్ తో రూ. 4.25 కోట్ల నికర వసూళ్లు చేసింది.
రెండవ వారాంతంలో ఈ ఎంటర్ టైనర్ కేవలం 15 శాతానికి పడిపోయింది. 10 రోజులు ముగిసేసరికి ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 28 కోట్ల రూపాయల డీసెంట్ వసూళ్లను సాధించింది. ఇక రెండో వీకెండ్ నాటికే 37కోట్ల వసూళ్లకు చేరింది.
ముంబై (సిటీ) సర్క్యూట్ లో దాదాపు 15 కోట్ల నికర వసూళ్లతో దాదాపు 4.75 కోట్ల నెట్ ని రాబట్టి అసాధారణమైన వసూల్ ని సాధించింది. ‘పుష్ప’ హిందీకి గుజరాత్ మార్కెట్ లోనూ మంచి ఆదరణ లభించింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ యాక్షన్ డ్రామా రూ. 50-60 కోట్ల నికర వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇది నిజానికి సంచలనాల కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రం తరహాలో వసూల్ చేస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే ఒమిక్రాన్ టెన్షన్స్ నడుమ పుష్ప ఇంకా ఎంతకాలం బండిని సాఫీగా లాగుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.
‘పుష్ప’ వాస్తవానికి తెలుగు భాషా యాక్షన్ డ్రామా. తెలుగు- హిందీతో పాటు మలయాళం- తమిళం- కన్నడ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా విడుదలైంది. అల్లు అర్జున్- రష్మిక మందన్న- ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సుకుమార్ రచన మరియు దర్శకత్వం వహించారు.
వివాదం ప్లస్ అయ్యిందే కానీ!
డిసెంబర్ 17న విడుదలైన పుష్ప- దిరైజ్ సినిమాలోని ఓ రొమాంటిక్ సన్నివేశంపై తెలుగులో ఓ వర్గం ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాయకానాయికలు బహిరంగ ప్రదేశంలో ఘాటైన సన్నివేశంలో నటించడం మహిళాభిమానుల్లో వ్యతిరేకతకు కారణమైంది. వాన్ సీన్ ..టిఫిన్ సీన్ లకు అల్లు అర్జున్ అభిమానులు దిల్ ఖుష్ అయినా కానీ.. కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ తరువాత మేకర్స్ వివాదాస్పద సన్నివేశాన్ని తొలగించాలని నిర్ణయించారు. పుష్ప చిత్రంలో కథాంశం ఎలాబరేటెడ్ గా లేకపోయినా బన్ని వన్ మ్యాన్ షో.. నటీనటుల ప్రదర్శన పాటలు డ్యాన్సులు పుష్పని పెద్ద రేంజుకు తీసుకెళ్లాయి. అటు మలయాళంలోనూ ఈ చిత్రం రికార్డ్ స్థాయివ సూళ్లను సాధిస్తోంది.