`పుష్ప` మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ 172కోట్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పుష్ప తొలి మూడు రోజుల్లో అసాధారణ వసూళ్లను సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.172 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
`పుష్ప: ది రైజ్` బాక్సాఫీస్ వద్ద ఇకపైనా బెటర్ వసూళ్లతో సత్తా చాటాల్సి ఉంటుంది. తెలుగు-తమిళం-మలయాళంలో అమెరికాలో ఉత్తమ వసూళ్లను అందుకుంది ఈ చిత్రం. ఉత్తరాదినా ఈ సినిమా మరింత బెటర్ రిజల్ట్ అందుకుని ఉంటే వసూళ్లు అసాధారణంగా ఉండేవని భావిస్తున్నారు. అయినా కేవలం 3 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం బన్ని స్టార్ డమ్ ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక- ఫహద్ ఫాసిల్ -సునీల్- అనసూయ ముఖ్య పాత్రల్లో నటించారు. పుష్ప 2ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సుకుమార్ ఏర్పాట్లలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.