పుష్ప 3వ‌రోజు.. నైజాంలో ఫుల్ స్వింగ్ ఏపీలోనూ హ‌వా!

Update: 2021-12-20 09:12 GMT
ఏపీ నైజాం అమెరికాలో పుష్ప హ‌వా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 100కోట్ల వ‌సూళ్ల‌తో దూసుకెళ్లిన పుష్ప చిత్రం మూడో రోజు కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించింది. అన్ని చోట్లా థియేటర్లలో అల్లు అర్జున్ పుష్ప సందడి కొనసాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంట‌ర్ టైన‌ర్ భారీగా షేర్ సాధిస్తోంది. 3వ రోజు పుష్ప నైజాంలో 6.65 కోట్లు వ‌సూలు చేయ‌గా... ఆదివారం వసూలైన షేర్ శనివారం కంటే కాస్త ఎక్కువే.

ఈ చిత్రం నైజాంలో 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కృష్ణ - గుంటూరులలో పుష్ప  3వ రోజు కలెక్షన్లు ఆకట్టుకున్నాయి. వీకెండ్ లో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మాస్ చిత్రం డీసెంట్ షేర్ సాధించింది. 3వ రోజు కృష్ణాలో 81 లక్షలు వ‌సూలు చేయ‌గా..గుంటూరులో 65 లక్షల షేర్ వ‌సూలు చేసింది. దీంతో పుష్ప ఏకంగా కృష్ణ‌లో రూ.2.72 కోట్లు..గుంటూరు జిల్లాలో 3.5 కోట్ల షేర్ ఓవరాల్ గా రాబట్టింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం పుష్ప‌- ది రైజ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి వీకెండ్ అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా ఇప్ప‌టికే 100 కోట్ల గ్రాస్ ని అధిగ‌మించింద‌ని ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం క‌లెక్ష‌న్స్ అసాధార‌ణంగా ఉండ‌గా ఆంధ్రాలోనూ ఆశాజ‌న‌క‌మైన వ‌సూళ్ల‌ను సాధించింద‌ని రిపోర్ట్ అందింది.

అమెరికాలో 10 కోట్ల వ‌సూల్..

మ‌రోవైపు అమెరికాలో ఈ చిత్రం చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింది. అక్క‌డ ఎన్నారై ల నుంచి థండరింగ్ రెస్పాన్స్ ద‌క్కింద‌ని పంపిణీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. #పుష్ప ది రైజ్ అమెరికాలో 3 రోజుల్లో  1.5 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ ని చేరుకుంది. క్లాసిక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ -హంసిని ఎంట‌ర్ టైన్ మెంట్ ద్వారా పుష్ప‌USA లో  విడుద‌లైంది. ఇక ఇదే హుషారులో పుష్ప 2 మిలియ‌న్ క్ల‌బ్ లో చేరుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పుష్ప ఇప్ప‌టికి సుమారు 10 కోట్లు పైగా అమెరికా బాక్సాఫీస్ నుంచి వ‌సూలు చేసింది. ఇక‌పైనా మ‌రింత‌గా రాణిస్తుంద‌ని భావిస్తున్నారు.

త‌మిళం మ‌ల‌యాళంలోనూ

పుష్ప కి తెలుగులో నెగెటివ్ రివ్యూలు వ‌చ్చినా త‌మిళం-మ‌ల‌యాళంలో ఆ స‌మ‌స్య లేక‌పోవ‌డం హోప్ ని పెంచింది. పుష్ప‌కు తొలి వీకెండ్ వ‌సూళ్లు అన్నిచోట్లా బావున్నాయి. టాక్ ప‌రంగా నెగిటివిటీ ఉన్నా గానీ బ‌న్నీ మాస్ ఇమేజ్ జ‌నాల్ని థియేట‌ర్ కి ర‌ప్పించ‌గ‌లుగుతోంది.  ఇక హిందీలోనూ పుష్ప అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. అయితే తెలుగు-హిందీ వెర్ష‌న్ల‌కు భిన్నంగా త‌మిళం.. మ‌ల‌యాళం భాష‌ల్లో మాత్రం పుష్ప‌కి మంచి రివ్యూలు వ‌చ్చాయి. ఇది పుష్ప‌కు అన్నిర‌కాలుగా క‌లిసొస్తోంద‌ని స‌మాచారం.
Tags:    

Similar News