బన్నీ, నాని మండే టెస్ట్ పాయ్యారండోయ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్` ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిపిందే. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ రోజు ఓపెనింగ్స్ పరంగా కార్డులు సృష్టించింది. ముందు కొంత డివైడ్ టాక్ వినిపించినా ఆ తరువాత కుదురుకుని వసూళ్ల పరంగా సరికొత్త రికార్డుల్ని నమోదు చేసింది. సుకుమార్ - బన్నీల కలయికలో వచ్చిన మూడవ సినిమా ఇది. ఈ మూవీతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ గా మారిపోయింది.
బన్నీని గంధపు చెక్కల స్మగ్లర్ గా కొత్త తరహా పాత్రలో ఊర మాస్ గా చూపించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.అంతే కాకుండా బన్నీ కెరీర్‌లో తొలిసారి ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదైన సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో సినిమా భారీగా వసూళ్లని రాబడుతోంది. ఈ సినిమా జోరుమీదుండగానే ఈ నెల 24న నేచురల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రం విడుదలైంది. దీంతో `పుష్ప` హవా కొంత వరకు తగ్గిందని అన్నారంతా..
ఇలా రెండు క్రేజీ చిత్రాలు నైజాంలో మండే టెస్ట్ పాసవ్వడం ఖస్టం అనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఆ వాదనలకు బ్రేకిస్తూ పుష్ప,శ్యామ్ సింగ రాయ్ మండే టెస్ట్ ని పాసయి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచాయి. బన్నీనటించిన చిత్రాలు `పుష్ప` చిత్రం మండే రోజు 40 లక్షల షేర్‌ని రాబట్టి మండే టెస్ట్ ని విజయవంతంగా పాసైంది.
ఇక నేచురల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగ రాయ్` మండే రోజు 55 లక్షల షేర్‌ని రాబట్టి ఈ సినిమా కూడా మండే టెస్ట్ ని పాసైంది. ఇది ఈ సినిమాలు మండే రోజు సాధించిన డీసెంట్ అమౌంట్ గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాని నటించిన `శ్యామ్ సింగ రాయ్` దేవదాసీ వ్యవస్థ ఆధారంగా కోల్ కత నేపథ్యంలో సాగే చిత్రమిది. టైమ ట్రావెలింగ్ కథగా సాగే ఈ సినిమా ఈ నెల 24న విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు. అదే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఇక `పుష్ప` విషయానికి వస్తే ఇంత వరకు స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నబన్నీ తొలి సారి ఊరమాస్ పాత్రలో పుష్పరాజ్ గా నటించడం, గత చిత్రాలకు పూర్తి భిన్నంగా బన్నీ పాత్ర వుండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు సినిమాలు దేనికదే ప్రత్యేకతని కలిగి వుండటంతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ మండే టెస్ట్ ని పాస్ కావడం విశేషం.