• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2.. సుకుమార్ కు...

పుష్ప 2.. సుకుమార్ కు బన్నీ సలహాలు!

By - Tupaki Desk
Update: 2022-06-09 13:30 GMT
స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప 1 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని అల్లుఅర్జున్ మార్కెట్ ను కూడా పెంచేసింది.

కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీ లో కూడా సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో హడావిడిగా సినిమాను విడుదల చేసినప్పటికీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకుంది అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్స్ తో సినిమాను విడుదల చేస్తే ఇంకా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇటీవల చిత్రయూనిట్ అదే విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసలైతే పుష్ప సెకండ్ పార్ట్ షూట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ని మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ RRR, కేజిఎఫ్ 2 సాధించిన విజయాలతో ఆడియన్స్ అంచనాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. యాక్షన్ ఎలివేషన్ సైతం మామూలుగా ఉండకూడదు అనే చాలా క్లారిటీ గా అర్థమైంది.

తప్పకుండా పుష్ప 2 అయితే ఊహించని రేంజ్ లోనే ఉంటుంది అని అల్లు అర్జున్ కి అర్థమైంది. ఇక సుకుమార్ కూడా అదే ఆలోచనలో పడ్డాడు. రీసెంట్ గా వీరిద్దరూ మరోసారి పుష్ప సెకండ్ పార్ట్ విషయం గురించి చర్చించుకున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే అల్లు అర్జున్ ఎక్కువగా మార్పులు చేయమని కోరినట్లు తెలుస్తోంది.

అసలైతే పుష్ప పార్ట్ వన్ షూట్ జరిగినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పుడు అంచనాలు మారిపోవడంతో మరికొన్ని సన్నివేశాలను కూడా రీ షూట్ చేయాలని స్క్రిప్టు విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ సలహా ప్రకారం సుకుమార్ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలి అని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను 2023 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
Tags:    
  • Tollywood 
  • panindia 
  • movie 
  • pushap 
  • pushpa2 
  • Alluarjun 
  • sukumar 
  • alluarjunpushpa2 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS